పెళ్లి పీటలపైనే మూత్రం పోసిన వరుడు.. వధువు రియాక్షన్ ఇదే

by sudharani |   ( Updated:2023-03-15 02:27:37.0  )
పెళ్లి పీటలపైనే మూత్రం పోసిన వరుడు.. వధువు రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: మందు బాబులు ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తారో ఎవరికి తెలియదు. ఒక్కోసారి వాళ్లు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. మరి కొన్ని సార్లు చిరాకు తెప్పిస్తాయి. తాజాగా ఇలాంటి సంఘటనే అసోంలో జరిగింది. పెళ్లి కొడుకు ఫుల్‌గా మద్యం సేవించి పెళ్లి మండపానికి వచ్చి నానా రచ్చ చేశాడు. దీనికి వధువు రియాక్షన్‌తో అక్కడ ఉన్నవారు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

నల్బరీ జిల్లాకి చెందిన ప్రసేన్‌జిత్ హలోయ్‌‌ అనే వ్యక్తికి పెళ్లి కుదిరింది. అతడు పెళ్లి మండపానికి పూర్తిగా మద్యం సేవించి వచ్చాడు. పీటలపై కూర్చున్న వరుడు పండితుడు చెప్పిన మంత్రాలను సైతం చెప్పలేకపోయాడు. దీంతో వరుడు బంధువులు అతడికి సర్ధి చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా సరే వరుడు పట్టించుకోకుండా చిత్ర విచిత్రమైన ఫోజులు పెట్టి ఆఖరికి అతడి పక్కనే ఉన్న వేరే వ్యక్తిపై పడుకున్నాడు.

ఈ సంఘటన చివరి వరకు వరుడు మామూలు స్థితికి వస్తాడు అని ఎదురు చూసిన వధువుకి చిరాకు వచ్చి పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయింది. అయితే వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం వరుడు పెళ్లి పీటలపైనే మూత్రం పోసినట్లు తెలుస్తోంది. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇదే విషయమై వధువు కుటుంబసభ్యులను ప్రశ్నించగా.. అసలు వరుడు కారులో నుంచి కూడా దిగే పరిస్థితిల్లో లేడని ఆకరి అతడి తండ్రి కూడా మద్యం సేవించి ఉన్నాడని తెలిపారు.

Advertisement

Next Story