అదనపు కట్నంగా ట్రాక్టర్ అడిగిన పెళ్లికొడుకు.. వధువు చేసిన పనికి వరుడు ఫ్యామిలీ షాక్

by sudharani |
అదనపు కట్నంగా ట్రాక్టర్ అడిగిన పెళ్లికొడుకు.. వధువు చేసిన పనికి వరుడు ఫ్యామిలీ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పెళ్లి సమయంలో కట్నకానుకల గురించి మాట్లాడుకోవడం సహజం. అయితే కొంత మంది అదనపు కట్నం కూడా డిమాండ్ చేస్తారు. ఈ క్రమంలోనే ఓ వరుడు కుటుంబం ముందు మాట్లాడుకున్న కట్నం సరిపోదని వారికి అదనపు కట్నంగా ట్రాక్టర్ కావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వధువు కుటుంబం.. వరుడు ఫ్యామిలీకి బుద్ధి చెప్పిన విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పెళ్లి సమయంలో ఓ వరుడు కుటుంబం.. వధువు ఫ్యామిలీ నుంచి అదనపు కట్నంగా ట్రాక్టర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ ఇస్తేనే పెళ్లి చేసుకుంటాము అనే ఒప్పందంతో మండపానికి వచ్చారు వరుడు కుటుంసభ్యులు. ఈ మేరకు పెళ్లి కూతురు ఫ్యామిలీ వరుడు కోరినట్లు కొత్త ట్రాక్టర్‌ను డెకరేట్ చేసి మండపానికి తీసుకొచ్చారు. అయితే మండపానికి చేరుకున్నాక వరుడు కుటుంబాన్ని బంధించి.. మీరు పెళ్లి చేసుకోవాల్సింది వధువును కాదు ట్రాక్టర్‌ను చేసుకోవాలని పట్టుబట్టారు. దీంతో సీన్ అర్థం అయిన పెళ్లి కొడుకు ఫ్యామిలీ వాళ్లు చేసిన తప్పుకు పెళ్లిని రద్దు చేసుకున్నారు. అంతే కాకుండా పెళ్లి కోసం చేసిన ఖర్చులు కూడా చెల్లిస్తామని అంగీకరించారు. దీంతో పెళ్లి కూతురు కుటుంబం వారిని విడిచిపెట్టింది.

ఈ సంఘటనపై పెళ్లి కూతురు మేనమామ మాట్లాడుతూ.. పెళ్లి కొడుకు ఫ్యామిలీకి ఫర్నీచర్, ఫ్రిజ్, ఇతర వస్తువులకు లక్షలు ఖర్చు పెట్టి చేయించి పెళ్లికి ముందే వారి ఇంటికి పంపామని తెలిపాడు. అయినా కూడా సంతృప్తి చెందని పెళ్లి కొడుకు ఫ్యామిలీ అదనపు కట్నంగా ట్రాక్టర్ కావాలని డిమాండ్ చేయడంతో వధువు పెళ్లిని రద్దు చేసుకుందని తెలిపాడు. అదనపు కట్నం అడిగిన వరుడుని పెళ్లి చేసుకోవడవ వధువుకు ఇష్టం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story