రైతన్నకు పోలీసన్న సాయం! వీడియో వైరల్

by Ramesh N |   ( Updated:2024-04-02 12:38:24.0  )
రైతన్నకు పోలీసన్న సాయం! వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డుపై ఇబ్బందిపడుతున్న రైతన్నకు పోలీసు సహాయం చేసి గ్రేట్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తాండూరులో ఎడ్ల బండి పై వెళుతున్న ఓ రైతు బండి చక్రం అకస్మాత్తుగా ఊడిపోయింది. దీంతో బండికి చక్రాన్ని తిరిగి అమర్చేందుకు రైతన్న తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. సహాయం చేయమని రోడ్డుపై వెళ్తున్న వారిని కోరినప్పటికీ ఎవరూ పట్టించుకోకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

ఆ సమయంలో అటువైపు కారులో వెళ్తున్న తాండూరు పీఎస్‌లో పనిచేస్తున్న ఏఎస్ఐ గోపాల్ ఆ రైతు పడుతున్న ఇబ్బందిని గమనించారు. వెంటనే కారు రోడ్డు పక్కకు ఆపి రైతు వద్దకు వెళ్లి.. ఎడ్ల బండి చక్రాన్ని సరిచేసి రైతుకు సహాయాన్ని అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు పోలీసుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story