Suicide Attempt: సెల్ఫీ వీడియోతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Shiva |
Suicide Attempt: సెల్ఫీ వీడియోతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సెల్ఫీ వీడియో (Selfy Video)తో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన కాకినాడ జిల్లా (Kakinada District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తొండంగి (Thondangi Mandal) మండల పరిధిలోని ఏ.కొత్తపల్లి (A.Kothapally) గ్రామానికి చెందిన పిల్లి అమ్మోరు అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే పంట పెట్టుబడికి గాను రూ.10 వడ్డీ చొప్పున గ్రామంలోని వడ్డీ వ్యాపారులైన నరాల సోమరాజు, వనపర్తి సత్తిబాబు వద్ద అప్పు చేశాడు. అనంతరం అతివృష్టి కారణంగా అమ్మోరు తీవ్రంగా నష్టపోయాడు.

అయితే, తమ అప్పును ఎక్కడ తీర్చలేడేమోనని వడ్డీ వ్యాపారులు నరాల సోమరాజు, వనపర్తి సత్తిబాబు కలిసి పిల్లి అమ్మోరును బెదిరింపులకు గురి చేసి ఆయన ఇంటిని వారి పేరు మీద అక్రమంగా రాయించుకున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అమ్మోరు తన సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో (Selfy Video) ద్వారా తన బాధలు చెప్పుకుంటూ క్రిమి సంహారక (Insecticide) మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ వీడియోలో తన చావుకు కారణం సోమరాజు, సత్తిబాబేనని స్పష్టం చేశాడు. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన అమ్మోరును గమనించిన కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే, అమ్మోరుకు సంబంధించిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story

Most Viewed