- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Funny Answer: ఉపమాలంకారం గురించి రాసిన ఈ బుడ్డోడు ఆన్సర్ షీట్ చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే?
దిశ, ఫీచర్స్: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల ఫన్ కంటెంట్ వైరల్ అవుతోంది. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా కొంతమంది చేసే చిలిపి చేష్టలు నెట్టింట జనాలను ఎంతగానో నవ్విస్తుంటాయి. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సంబంధించిన ఫన్నీ వార్తలు, వీడియోలు చూసే ఉంటాం. సాధారణంగా ఎగ్జామ్స్ అంటే పిల్లలు భయంతో వణికిపోతుంటారు. కొంతమంది ఎగ్జామ్స్ ముందు నుంచే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటారు. టైమ్ వేస్ట్ చేయకుండా కష్టపడి చదువుతుంటారు.
కానీ కొంతమంది పిల్లలు కాస్త భిన్నంగా ఉంటారు. పరీక్షల సమయం దగ్గర పడేదాక చదవకుండా టైమ్ పాస్ చేస్తారు. కొంతమంది టెన్షన్ తో హెల్త్ కరాబ్ చేసుకుంటారు. మరికొంతమంది విద్యార్థులైతే ఏకంగా ఇంట్లో వారిని సైతం ఆందోళనకు గురిచేస్తుంటారు. ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతామోనని కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. మరికొంతమంది ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లాక ఏం చేయాలో అర్థం కాక కవిత్వాలు, సినిమా స్టోరీస్ రాస్తుంటారు. రీసెంట్ గా ఓ విద్యార్థి తనకు క్యాన్సర్ అని ఎలాగైనా పాస్ చేయాలని రాయడంతో ఇన్విజిలేటర్ షాకింగ్ తో నోరెళ్లబెట్టారు.
అయితే తాజాగా ఓ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఎగ్జామ్ పేపర్‌లో ప్రదర్శించిన తెలివి చూసి సోషల్ మీడియాలోని జనాలు నవ్వలేక చచ్చిపోతున్నారు. పరీక్షలో ఉపమాలంకారం గురించి రాయమంటే.. ఓ ఇస్మార్ట్ స్టూడెంట్ రాసిన సమాధానం చూసి టీచర్ బిత్తరపోయాడు. ఆన్సర్ షీట్ లో ఉప్మా తయారు చేసే విధానాన్ని ఎంచక్కా రాసి, పేపర్ నింపేశాడు. అందులో ఉప్మా తయారు చేయడానికి ఏం కావాలి, ఎలా రెడీ చేయాలి.
ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటూ స్టూడెంట్ సవివిరంగా వివరించాడు. ఈ బుడ్డోడి సమాధాన్ని టీచర్ అడ్డంగా కొట్టిపడేశారు. ప్రస్తుతం ఉప్మాతో ఉపమాలంకారాన్ని ఎంతో చక్కగా వివరించిన విద్యార్థి ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అసలైన జాతిరత్నం అంటే వీడేరా, ఫ్యూచర్ లో మంచి వంటగాడివి అవుతావురా తమ్ముడు, నువ్వు తోప్ రా అంటూ కామెంట్లు పెట్టగా.. మరికొంతమంది ఒరేయ్.. ఆ భూతులు ఎంట్రా అంటూ మరో భాషాభిమాని కామెంట్ పెట్టాడు.