- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Be Careful: పార్కింగ్ చేసిన బైక్పై కూర్చుంటున్నారా..? ఇకపై అంతే సంగతి(వీడియో)
దిశ, సినిమా: సాధారణంగా మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు వాహనాన్ని పార్కింగ్ చేస్తాం. ఒకవేళ అక్కడ కనుక పార్కింగ్ ఆప్షన్ లేకపోతే రోడ్ పక్కన పార్క్ చేసి వెళ్లిపోతాము. ఇక వెళ్లిన పని అయిపోయిన తర్వాత యదావిధిగా వచ్చి కూర్చుంటాము. కానీ, ఈ వీడియో చూస్తే మాత్రం అలా కూర్చోవడానికి కొంచెం సందేహించాల్సిన అవసరం ఉన్నదిగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
వాహనదారుడు తన స్కూటీని పార్కింగ్ చేసి తన పని మీద ఎక్కడికో వెళ్లి వచ్చాడు. అయితే తిరిగి వచ్చిన తర్వాత అతని బండిని తీసుకోవడానికి వచ్చి చూడగా అతనికి ఓ షాకింగ్ సీన్ కనపడింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆతడి స్కూటీపై ఓ గుండుసూదిని( Needle ) గుచ్చి ఉంచడం కనబడుతుంది. ఒకవేళ పొరపాటున చూసుకోకుండా సీటుపై కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా శరీరంలోకి కుచ్చుకుపోయే విధంగా సూదిని ఏర్పాటు చేశారు. అయితే వాహనదారుడు స్కూటీపై కూర్చున్న సమయంలో గుండుసూదిని అక్కడ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
వెంటనే దాన్ని వీడియో తీస్తూ కొన్ని అసలైన విషయాలను తెలియజేశాడు. ఒకవేళ ఇలాంటి గుండు సూదికి ఏదైనా తప్పు ఉంటే అది లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్ లాంటిది తయారవుతుందని.. అంతేకాకుండా కొందరు ఇలాంటి వాటికీ ఏదైనా కెమికల్స్ రాసి ఉంచుతారని, అలాగే కొన్ని ఎయిడ్స్ వంటి రోగాలకు సంబంధించిన కారకాలను కూడా వీటిపై చేర్చి ఉంటారని.. వీడియోలో తెలిపాడు. కాబట్టి ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచి వాహనాలు ఎక్కేటప్పుడు ఒకటికి రెండుసార్లు సీటును చెక్ చేసుకుని ఎక్కడం బెటర్ అంటూ తెలియజేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
(video link credits to iammharshvlogs instagram id)