ఆడ 'పిశాచి' ముఖాన్ని చూపించిన శాస్త్రవేత్తలు.. ధైర్యం ఉంటే చూడండి !

by Sumithra |
ఆడ పిశాచి ముఖాన్ని చూపించిన శాస్త్రవేత్తలు.. ధైర్యం ఉంటే చూడండి !
X

దిశ, ఫీచర్స్ : మనం మన చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు రక్త పిశాచాల గురించి చాలా కథలు వినే ఉంటాం. అంతే కాదు హారర్ సినిమాల్లో కూడా చూసి ఉంటాం. మనం విన్న కథల్లో పిశాచాలు జీవించి ఉన్న మానవుల రక్తాన్ని తాగి శక్తిని పెంచుకుంటాయని చెబుతుంటారు. పూర్వకాలంలో రక్త పిశాచాలు ఉండేవని విశ్వసించే కొందరు వ్యక్తులు ప్రపంచంలో ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు వాటికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు కనుగొనలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ విషయం ఈ మధ్యకాలంలో చర్చనీయాంశమైంది. శాస్త్రవేత్తలు 16వ శతాబ్దపు మహిళ ముఖాన్ని పునః సృష్టించారు. ఈ చిత్రాన్ని చూసిన ఇటలీలో నివసించే స్థానిక ప్రజలు రక్త పిశాచి అని నమ్ముతారు.

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ప్రజల రక్తాన్ని తాగకుండా ఉండేందుకు మహిళ నోటిలో ఇటుకను పెట్టారని శాస్త్రవేత్తలు తెలిపారు. నిజానికి ఈ భయానక కథ వెనిస్‌లోని లజారెట్టో నువోవో ద్వీపంలో కనుగొన్న సామూహిక సమాధిలో ప్రారంభమయిందని చెబుతున్నారు. పూర్వం అంటే 1500ల చివరి నుంచి 1600ల మధ్య బుబోనిక్ ప్లేగుతో బాధపడుతున్న ఇక్కడి రోగులను నిర్బంధంలో ఉంచారని తెలిపారు.

దీవిలో మహిళ మృతదేహం..

కొన్ని నివేదికల ప్రకారం 2006 సంవత్సరంలో పురావస్తు శాఖ ఈ ద్వీపంలో కొన్ని మృతదేహాలను కనుగొంది. ఆ మృతదేహాలను శతాబ్దాల క్రితం ఖననం చేశారట. అయితే ఫోరెన్సిక్ పరిశోధకుడు సిసిరో మోరేస్ నైరుతి న్యూస్ సర్వీస్‌తో ఓ విచిత్రమైన కథ గురించి చెప్పాడట. అతను ఆడ పిశాచాన్ని గుర్తించినట్లు స్పష్టం చేశాడట. ఆ పిశాచి పూర్వం ప్లేగు వ్యాధికి కారణమైన వారిలో ఒకరని తెలిపారు. అయితే ఆ పిశాచి నోట్లో ఇటుక ఉందని ప్రజల రక్తాన్ని తాగకుండా ఉండేందుకు మహిళ నోటిలో ఇటుకను పెట్టారని చెప్పారు.

రహస్యాన్ని ఛేదించే పనిలో శాస్త్రవేత్తలు..

ఆ మహిళ యూరోపియన్ అని ఆమె 61 సంవత్సరాల వయస్సులో మరణించిందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయం శాస్త్రవేత్తలను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసిందని చెబుతున్నారు. ఆ మహిళ నోటిలో ఇంత పెద్ద ఇటుక ఎలా పెట్టారు. ఆ సమయంలో ఆమె బతికే ఉందా లేదా చనిపోయిందా ? అనే ప్రశ్నలు వారిలో తలెత్తాయట. ఈ శతాబ్దాల నాటి రహస్యాలు ఇప్పటికీ మిస్టరీలుగా మిగిలిపోయాయని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు కూడా ఇప్పటి వరకు వాటిని పరిష్కరించడానికి చాలా కష్టపడ్డారని చెప్పారు.

Advertisement

Next Story