- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral Video : పోలీస్‌గా నటిస్తూ నిజమైన పోలీస్‌కే కాల్ చేసిన స్కామర్.. తర్వాత ఏమైందంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు ఈ మధ్య వివిధ పద్దతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో నకిలీ పోలీస్ స్టేషన్లు, ఫేక్ కోర్టులు సృష్టించి పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీస్ అధికారుల వేశంలో వీడియో కాల్స్ చేసి డబ్బులు కాజేసే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ స్కామర్ (Scammer) పోలీస్ వేషంలో తెలియక నిజమైన పోలీసుకే వీడియో కాల్ చేసి షాక్ తింటాడు. ముంబై పోలీస్ అధికారినంటూ కేరళలోని (Thrissur City Police) త్రిసూర్ పోలీస్ అధికారికి స్కామర్ వాట్సప్ కాల్ చేస్తాడు. పోలీస్ స్టేషన్ సెటప్‌తో పూర్తి యూనిఫాం ధరించి ఉన్న స్కామర్, అతను నిజమైన పోలీసు అధికారులతో మాట్లాడుతున్నాడని గ్రహించడు.
నీ ఫేస్ కనిపించడం లేదు అని స్కామర్ చెప్పే సరికి పోలీస్ అధికారి తన ఫేస్ మాస్క్ తీసి కెమెరాని తన యూనిఫామ్ వైపు చూపిస్తారు. దీంతో స్కామర్ ఖంగుతింటాడు. నిజమైన పోలీస్‌కి కాల్ చేశానని గ్రహించి స్కామర్ నోట మాట రాకుండా అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల తెలివితేటల ముందు నీవు ఎంతరా? అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెట్టారు.