- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గృహిణులకు గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన ధరలు..!!
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో ఉల్లి, వెల్లుల్లి, టమాటా ధరలు కనివిని ఎరగని రీతిలో కొండెక్కి కూర్చుంటున్నాయి. దీంతో సామాన్యులు ఏం కొనాలన్నా జంకుతున్నారు. అయితే మొన్నటి వరకు మార్కెట్లో చుక్కలు చూపించిన వెల్లుల్లి ధరలు తాజాగా తగ్గుముఖం పట్టడంతో గృహిణులకు భారీ ఊరట కలిగింది. కానీ రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రైతులు పోలాల్లోంచి వెల్లుల్లి పంట మార్కెట్ లోకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో వెల్లుల్లి ధర తగ్గడంతో రైతులకు కాస్త నిరాశే మిగిలిందని చెప్పుకోవచ్చు.
మొన్నటివరకు వెల్లుల్లి ధర ఆకాశాన్నంటుకుని ఉండగా.. ఇప్పుడు దిగడంతో కూరగాయల దుకాణాల్లో, కిరాణ షాపుల్లో మళ్లీ కనిపించడం మొదలైంది. వెల్లుల్లి ధర చూసుకున్నట్లైతే.. మార్కెట్లో కిలో వెల్లుల్లి ధర రూ. 400 నుంచి రూ. 500 వరకు పలుకుతుంది. తాజాగా వెల్లుల్లి రూ. 40 కు తగ్గించారు. వ్యాపారులు తెలిపిన ప్రకారం.. రైతులు మళ్లీ వెల్లుల్లి పంట కోసం సాగు చేస్తున్నారు. పండిన పంటను మార్కెట్ లోకి తరలిస్తున్నారు. దీంతో మార్కెట్ లో జనాలు పెద్ద ఎత్తున విక్రయించడం ప్రారంభించారు. ఈ కారణంగా వెల్లుల్లి ధర తగ్గింది. రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశముందని చెబుతున్నారు.