- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Madhapur: ఠాగూర్ సినిమా స్టైల్లో శవానికి ట్రీట్‌మెంట్.. లక్ష కట్టాక డెడ్‌బాడీ అప్పగింత
దిశ, వెబ్‌డెస్క్: మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పేషెంట్ చనిపోయినప్పటికీ చికిత్స చేస్తున్నామంటూ లక్ష ఫీజు వసూలు చేశారు డాక్టర్లు. అయితే అప్పటికే రూ.3 లక్షలు కట్టిన కుటుంబం మరో లక్ష రూపాయలు కట్టిన తర్వాత.. మీ కుమార్తె చనిపోయిందంటూ డెడ్‌బాడీని అప్పగించారు. బాధితుల కథనం ప్రకారం.. అనారోగ్యంతో జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరింది. ఆమెకి చికిత్స అందిస్తుండగా.. రాత్రి ఆమె మృతి చెందింది. కానీ ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిపెట్టిన ఆసుపత్రి యాజమాన్యం.. ట్రీట్‌మెంట్ కొనసాగించాలంటే ఇంకో లక్ష బిల్లు కట్టాలని, లేకపోతే ట్రీట్‌మెంట్ ఆపేస్తామని కుటుంబసభ్యులపై ఒత్తిడి తెచ్చారు. ఇక అప్పటికే రూ.3 లక్షలకుపైగా డబ్బు కట్టిన నాగప్రియ కుటుంబం.. ఎంతో కష్టపడి ఉదయం మరో రూ.లక్ష కట్టింది. అయితే రూ.లక్ష కట్టిన తర్వాత నాగప్రియ చనిపోయిందంటూ ఆమె మృతదేహాన్ని అప్పగించారు డాక్టర్లు. దీంతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబసభ్యులు డబ్బు కోసమే మృతి వార్తను దాచిపెట్టారంటూ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.