- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Stock markets: అమెరికా అధ్యక్ష ఫలితాల్లో ట్రంప్ ముందజ.. లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు(US president election Results) ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. తాజా ట్రెండ్స్ ప్రకారం.. మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) 230 ఎలక్ట్రోరల్ ఓట్లను సాధించి అధ్యక్ష ఎన్నికల్లో లీడ్‌లో కొనసాగుతున్నారు. అలాగే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్(Kamala Harris) 182 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించి వెనుకంజలో ఉన్నారు. దీంతో అమెరికా అధ్యక్ష రేసులో ట్రంప్ కొనసాగుతున్నారు. ఇన్ని రోజుల్లు నష్టాల్లో కొనసాగిన నిఫ్టీ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల వేళ స్టాక్ మార్కెట్లు( Stock markets) లాభాల్లో దూసుకుపోతున్నాయి. దీంతో వరుసగా నష్టాలు చవి చూస్తున్న దేశీయ సూచీలు కోలుకుంటున్నాయి. సోమవారం భారీగా నష్టపోయిన సూచీలు మంగళవారం కోలుకున్నాయి. బుధవారం కూడా లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్(Sensex) లాభాల బాటలో పయనించి 80 వేల మార్క్‌ను కూడా దాటింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే లాభాల్లో కొనసాగుతుంది. తాజా ట్రెండ్స్ ప్రకారం.. 300 పాయింట్ల లాభంతో 80, 115 వద్ద గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 242 పాయింట్ల లాభంతో 79, 751 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా 200 పాయింట్లకు పైగా లాభపడి 24, 400 మార్క్‌ను దాటేసింది.
Read More..
US elections: అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న ట్రంప్.. 210 ఎలక్టోరల్ ఓట్లు కైవసం