Rakhi - Police : వీధుల్లో కష్టపడుతున్న ఆడపిల్లలతో రాఖీ కట్టించుకున్న పోలీసు.. కట్నంగా ఏమిచ్చాడో తెలిస్తే సెల్యూట్ చేయక మానరు..

by Sumithra |   ( Updated:2024-08-19 14:46:00.0  )
Rakhi - Police : వీధుల్లో కష్టపడుతున్న ఆడపిల్లలతో రాఖీ కట్టించుకున్న పోలీసు.. కట్నంగా ఏమిచ్చాడో తెలిస్తే సెల్యూట్ చేయక మానరు..
X

దిశ, ఫీచర్స్ ; రక్షా బంధన్ అనేది సోదర సోదరీమణులు జరుపుకునే అపురూపమైన పండుగ. ఒకరికి ఒకరం రక్షగా ఉంటామని అన్నాచెల్లెల్లు హామీ ఇచ్చుకునే ఫెస్టివల్. కానీ ఈసారి కోల్ కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన ఇన్సిడెంట్ తో చాలా మంది ఈ సొసైటీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. అందుకు తాము కూడా బాధ్యత వహించాలని అంటున్నారు. ఇకపై ఆడపిల్లల మీద ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే తను కూడా బాధ్యత వహిస్తానని ... ఏ దిక్కు లేని పిల్లలకు అన్నగా మారుతానని అంటున్నాడు ఓ పోలీసు అధికారి. రాఖీలు అమ్ముకుంటున్న చిన్న పాప, రోడ్డు మీద అడుక్కుంటున్న చిన్నారితో రాఖీ కట్టించుకున్నాడు. వారిని ఆశీర్వదించి కట్నంతోపాటు స్వీట్ బాక్స్ అందించాడు.

కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ప్రేమతో కూడిన కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి బాధల్లో ఉన్న అమ్మాయిలతో రాఖీ కట్టించుకుని మంచి పని చేసావని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకో ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని,. ఇంటర్నెట్ లో చూసిన బెస్ట్ కంటెంట్ ఇదేనని చెప్తున్నారు.

Read more...

RAKHI FESTIVAL: రాఖీ కట్టాక డబ్బులిచ్చే ఆచారం.. దీని వెనకున్న అసలు చరిత్ర ఇదే?

Advertisement

Next Story