- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
వైరలవుతోన్న 1965 టిఫిన్స్ ధరలు.. బిల్లు చూస్తే ఖంగుతినాల్సిందే?
దిశ, ఫీచర్స్: తాజాగా 1965 లో టిఫిన్స్ కు సంబంధించి ఓ బిల్లు చిట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుత రోజుల్లో టిఫిన్ చేసినా ట్యాక్స్ జీఎస్టీ, సీజీఎస్టీ కట్టాల్సిందే. ఆ రోజుల్లో ఎలాంటి టాక్స్ లు లేకుండా ఉన్న ఈ బిల్లు చూసి సోషల్ మీడియాలోని జనాలు షాక్ అవుతున్నారు. రేపల్లెలోని హోటళ్ల యజమానులు ఓ పాంప్లెట్ ముద్రించారు.1965 నవంబర్ 1 వ తారీకున ప్రింట్ అయిన ఈ పాంప్లెట్‌లో టిఫిన్ల రేట్లు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి.
ఇది కూడా ధరల పెంపు తర్వాత రేట్లు. అప్పట్లో రెండు ఇడ్లీల ధర 15 పైసలు, ఉప్మా, అట్టు ధర కూడా 15 పైసలే ఒక ఇడ్లీ ధర 08 పైసలు, కారం, గారె కూడా 15 పైసలుగా ఉంది. రవ్వ అట్టు మాత్రం 20 పైసలు కనిపిస్తుంది. మసాలా గారె, బోండా 20 పైసలు. కాఫీ, టీ రేట్లు కూడా 15 పైసలు. సగం కాఫీ, టీ ధర 12 పైసలుగా ఉంది.
పెరుగుతున్న నిత్యావసర ధరలు కారణంగా తినే ఆహారం కూడా ఖరీదవుతోంది. గ్యాస్, వంట నూనెల ధరలు ప్రస్తుత రోజుల్లో ఎలా మండిపడుతున్నాయో తెలిసిందే. దీంతో సంపాదించిన మనీ మొత్తం ఖర్చులకే అవుతుంది. కొంతమంది జనాలు బయట ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా.. హోటళ్లలో, రోడ్డు పక్కకున్న బండిపై అమ్ముతోన్న బజ్జీలు, మిర్చీ లాంటివి లాగేస్తుంటారు. ఇలా పలు అనేక కారణాలతో ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పుకోవచ్చు.