- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Police Attack : బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన పోలీస్.. మహారాష్ట్రలో మరో షాకింగ్ ఘటన
దిశ, డైనమిక్ బ్యూరో: తన కారుకు సైడ్ ఇవ్వలేదని స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళను తన పిల్లల ముందే ముక్కు పగిలేలా కొట్టాడు డ్రైవర్. శనివారం మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. అయితే, ఇవాళ పూణేలో మరో షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. ఓ పోలీస్ అధికారి ఏకంగా బస్సు డ్రైవర్ పై దాడికి దిగాడు. వీడియోలో ఉన్న ప్రకారం.. పూణేలో హెల్మెట్ ధరించిన ఓ పోలీస్ పీఎంపీఎంఎల్ బస్సు డ్రైవర్‌పై దాడి చేస్తున్నారు.
బస్సుకు తన బైక్‌ను అడ్డంగా ఆపి.. బస్సులోకి వచ్చి మరి డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. దాడి ఘటనను వీడియో తీశారు. అయితే, పోలీస్ అధికారి అలా ప్రవర్తించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నెటిజన్లు ఈ ఘటనపై మహారాష్ట్ర పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు పోలీస్ తీరుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. కొట్టడం పద్ధతి కాదని, డ్రైవర్ తప్పు చేసి ఉంటే కేసు పెట్టాలని, కొంత మంది బస్సు డ్రవర్లు కూడా రాష్ డ్రైవింగ్ చేస్తుంటారని నెట్టింట చర్చానీయాంశంగా మారింది.