Petrol Rates: వాహన దారులకు గుడ్ న్యూస్.. 5 లీటర్ల పెట్రోల్ కేవలం రూ. 3.60 మాత్రమే..

by Kavitha |
Petrol Rates: వాహన దారులకు గుడ్ న్యూస్.. 5 లీటర్ల పెట్రోల్ కేవలం రూ. 3.60 మాత్రమే..
X

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటినుంచి వివిధ రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డాన్స్, ఫుడ్, పెళ్లి, గొడవలు పడుతున్నవి, టాలెంటెడ్ వీడియోలు అంటూ తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని గతంలో వస్తువుల రేట్లు కూడా తెలుసుకోగలుగుతున్నాము. వాటికి సంబంధించిన బిల్లులు చూసినప్పుడు షాక్ అవ్వడం మన వంతు అవుతుంది. తాజాగా అప్పట్లో పెట్రోల్ రేట్‌కు సంబంధించిన ఓ బిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అది చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. అసలు అంత షాక్ అవ్వడానికి అందులో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బేసిక్‌గా మన తాత ముత్తాతలు మా టైమ్‌లో 1 రూపాయి ఇస్తే చాలు అన్ని వచ్చేవి. రూ. 100 ఉంటే కోటీశ్వరుడే. కానీ, ఈ కాలంలో రూ. 100 అంటే లెక్కేలేకుండా పోయింది అని అంటుంటే మనం చాలా సార్లు వినే ఉంటాం.. ఎందుకంటే నేడు ప్రతిదీ ఖరీదైపోయింది. నిత్యావసరాల వస్తువులు కూడా భారీగా పెరిగిపోయాయి. బయట టిఫిన్ చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఇష్టానుసారంగా పెరిగిన రేట్లు ఉన్న నేపథ్యంలో.. 1963 నాటి పెట్రోల్ బిల్లుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వైరల్‌గా మారిన బిల్లులో.. భారత్ పెట్రోల్ బంకులో ఓ వ్యక్తి 5 లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేశాడు. అయితే ఆ పెట్రోల్ ఖరీదు 3 రూపాయల 60 పైసలు అని బిల్లు చేశారు. అయితే ఇది ఒక లీటర్ పెట్రోల్ ధర కాదండోయ్.. ఐదు లీటర్ల పెట్రోల్ ధర. అంటే ఆ రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర 72 పైసలు మాత్రమే. ఒక్క రూపాయి కూడా లేదు. దీంతో ఈ బిల్లు కాస్త వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు రూ. 3.60 కు ఇంత పెట్రోల్ దొరుకుతుందా? ప్రస్తుత కాలంలో చేతిలో 100 రూపాయలు ఉన్నా లీటర్ పెట్రోల్ వస్తలేదని వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ అప్పటి రోజులు మళ్లీ వస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు.

(video link credits to rjharshil instagram id)


Advertisement

Next Story

Most Viewed