మండపం మీద వరుడు మాత్రమే ఉన్నాడు.. కానీ వధువు మాత్రం వేరే ప్రదేశంలో ?

by Prasanna |   ( Updated:2023-01-30 07:23:52.0  )
మండపం మీద వరుడు మాత్రమే ఉన్నాడు.. కానీ వధువు మాత్రం వేరే ప్రదేశంలో ?
X

దిశ, వెబ్ డెస్క్ : పెళ్లి అంటే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరు సందడి చేస్తుంటారు. పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం. కానీ బెలిజ్‌లో జరిగిన ఈ కథ వాటన్నింటి కంటే చాలా వేరు.. అదేంటో ఇక్కడ చూద్దాం. ఒక పక్క పెళ్లి ముహూర్తం సమయం.. ఇంకో పక్క వధువు ఇంకా పెళ్లి మండపానికి రాలేదు. ఇలాంటి పరిస్థితిని మీరు ఎప్పుడు ఎక్కడా చూసి ఉండరు. వధువులు బంధువులు, వరుడు బంధువులు అందరూ ఉన్నారు కానీ.. వధువు మాత్రం లేదు. ఈమె ఒకప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి రావాలిసి ఉంది. కానీ ఆమె వచ్చే విమానం అనుకోకుండా క్యాన్సల్ అయ్యింది. వధువు రాకపోవడంతో ఫంక్షన్ హాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమె ఎయిర్‌పోర్టులోనే ఉండిపోవాలిసి వచ్చింది. పెళ్లికి హాజరైన అతిథులు, బంధువులు వధువుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ పెళ్లిలో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది.

పెళ్లి తరవాత జరిగే రిసెప్షన్ కోసం రిసార్ట్‌ను బుక్ చేసుకున్నారు. మూడు ముళ్లే పడకుండా రిసెప్షన్ ఎందుకు ఇంక అని .. క్యాన్సల్ చేద్దామనుకున్నారు..కానీ రిసార్ట్ ఓనర్స్ రిఫండ్ చేయమని తేల్చి చెప్పేశారట. మొత్తం రూ.58 లక్షలు గాలిలో గాలిలో కలిసిపోయాయి. డెకరేషన్ , ఫోటోగ్రఫీ , వంటలు మొత్తం వేస్ట్ ఐపోయాయట. మంచు తుఫాను కారణంగా విమానాలను రద్దు చేసినట్టు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.

Advertisement

Next Story