- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Coca-Cola: ఇదెక్కడి మిక్సింగ్ రా? కోకా కోలా కాదు.. లోకల్ కోలా!
దిశ, డైనమిక్ బ్యూరో: చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూల్ డ్రింక్స్ ఇష్టంగా తాగుతారు. అయితే కూల్ డ్రింక్స్‌లలో దిగ్గజ కంపెనీ అయిన కోకా కోలా గురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ బిగ్ స్టార్స్ కోకా కోలా యాడ్స్ చేస్తూ గట్టిగా ప్రమోట్ చేస్తుంటారు కూడా. అయితే తాజాగా కోకా కోలా కి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరూ ఫేక్ కోకా కోలా ను తయారు చేస్తున్నారు. కోకా కోలా స్టిక్కర్ ఉన్న ఖాళీ డబ్బాలల్లో వారు తయారు చేసిన కోక్ కలర్ రంగు నీళ్లతో కోక్ బాటిల్లో ఫిలప్ చేసి.. అందులో ఒక రకమైన వాయువును నింపుతున్నారు. అది చూడటానికి కోకా కోలా 2 లీటర్, 1 లీటర్ బాటిల్ మాదిరి అచ్చం అలాగే ఉన్నాయి. అక్కడ వారు ఆ కోక్ డ్రింక్స్ ను తయారు చేసే ప్రాంతం సైతం అపరిశుభ్రంగా ఉన్నది.
ఆపరిశుభ్రమైన స్థలంలో కోకా కోలా పేరుతో ఫేక్ కూల్ డ్రింక్ అమ్ముతున్నారని ఈ విషయంపై కోకా కోలా యాజమాన్యానికి ట్విట్టర్ వేదికగా నెటిజన్లు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఇదెక్కడి మిక్సింగ్ రా బాబు అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈ కోకా కోలా తయారు చేస్తున్న ప్రాంతం భారత్ కాదని పాకిస్థాన్ ప్రాంతమని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. మరోవైపు ఇది భారత్‌లోనే అని మరికొంత మంది నెటిజన్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ ఫుడ్ సేఫ్టీ అథారిటీకి ట్విట్టర్ వేదికగా నెటిజన్లు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఫేక్ కోకా కోలా భారత్ లేదా పాకిస్థాన్‌లో తయారు చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కూల్ డ్రింక్స్ తాగే క్రమంలో జాగ్రత్త వహించడం మంచిది. ఎక్కువ శాతం కూల్ డ్రింక్స్ తాగకూడదని డాక్టర్లు సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే.