Viral News: ‘షాట్స్’తో వస్తే బ్యాంకులోకి నో ఎంట్రీ!

by Ramesh N |   ( Updated:2024-04-14 15:03:49.0  )
Viral News: ‘షాట్స్’తో వస్తే బ్యాంకులోకి నో ఎంట్రీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆడ, మగ అనే తేడా లేకుండా కంఫర్ట్ కోసం షాట్స్ ( 3/4 ఆఫ్ ప్యాంటు ) అందరూ వాడుతుంటారు. ఈ షాట్స్ వల్ల తాజాగా ఒక యువకుడికి ఓ సమస్య ఏర్పడింది. షాట్స్ వేసుకోని రావడంతో ఓ సెక్యూరిటీ గార్డు బ్యాంకులోకి రానివ్వలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట, నాగ్‌పూర్‌లోని కద్బీ చౌక్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఓ యువకుడు షాట్స్ వేసుకోని వచ్చాడు. అతని వాలకం చూసి సెక్యూరిటీ గార్డు లోని రానివ్వలేదు. దీంతో ఆ యువకుడు సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగాడు.

బ్యాంక్ ఖాత ఉందని చెప్పినా కూడా తనను బ్యాంకులోని రానివ్వలేదని, 3/4 ప్యాంట్ వేసుకున్నందుకు ఎంట్రీ ఇవ్వడం లేదని యువకుడు వీడియో తీశాడు. ఆఫ్ ప్యాంటులో వస్తే లోనికి రావద్దని ఎవరు చెప్పారని సెక్యూరిటీ గార్డును యువకుడు నిలదీశాడు. తాను బ్యాంకులోని రానివ్వకపోవడంపై యువకుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశాడు. దీంతో వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం సెక్యూరిటీ గార్డు చేసిన పనికి మండిపడ్డారు. బ్యాంకుకు వెళ్లాలంటే డ్రెస్ కోడ్ పాటించాలా? అని నెటజన్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story