సీనియర్ సిటిజన్ మంత్రికి మెట్రోలో సీటు ఇవ్వలేదు.. ఎటు పోతోంది సమాజం! (వీడియో)

by Ramesh N |   ( Updated:2024-05-18 12:01:57.0  )
సీనియర్ సిటిజన్ మంత్రికి మెట్రోలో సీటు ఇవ్వలేదు.. ఎటు పోతోంది సమాజం! (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఢిల్లీ మెట్రోలో లక్ష్మీ నగర్ వరకు ప్రయాణించారు. ఆమె ప్రయాణ సమయంలో ప్రయాణికులతో ముచ్చటించారు. అయితే, ఈ సమయంలో మంత్రి నిర్మలా సీతారామన్ నిలబడి లక్ష్మీ నగర్ వరకు ప్రయాణించాల్సి వచ్చింది. ఆ సమయంలో తోటి ప్రయాణికులు ఎవరు కూడా మంత్రికి సీటు ఇవ్వకుండా అలాగే కూర్చున్నారు. దీంతో ప్రయాణికులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.

సీనియర్ సిటిజన్ అయిన భారత ఆర్థిక మంత్రికి కూడా సీటు ఇవ్వలేదు.. అసలు ఎటు పోతోంది భారతీయ సమాజం.. ఆనాటి విలువలు అంటూ పలువురు సెటైర్లు వేశారు. మరోవైపు ‘మీరు ఎక్కాల్సింది మెట్రో కాదు.. ముంబై లోకల్, సాధారణ ట్రైన్స్ ఎక్కాలి అక్కడ ఎదురవుతున్న సమస్యలను మీరు చూడాలి. పదేళ్ల అధికారంలో ఉండి మనం ఏం చేశామన్నది మీకు అర్థం అవుతుంది’ అంటూ నెటిజన్లు మంత్రిని విమర్శించారు.

Advertisement

Next Story