సోషల్ మీడియాలో వైరలవుతోన్న కొత్త జంట ఫస్ట్‌నైట్ వీడియో..!!

by Anjali |   ( Updated:2024-02-29 14:05:37.0  )
సోషల్ మీడియాలో వైరలవుతోన్న కొత్త జంట ఫస్ట్‌నైట్ వీడియో..!!
X

దిశ, సినిమా: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో జనాలంతా చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా సెకండ్ల వ్యవధిలోనే తెలిసిపోతుంది. సమాచారాన్ని వీడియోల రూపాల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో నెట్టింట ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. గ్రామాల్లో సైతం సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది వ్యక్తులు మంచి కంటెంట్‌ ఉన్న వీడియోలతో జనాలను ఎంటర్‌టైన్ చేయగా.. మరికొంతమంది అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ప్రైవేటు వీడియోలు కూడా వదులుతున్నారు.

తాజాగా ఓ కొత్తగా పెళ్లైన జంట మొదటి రాత్రి కార్యక్రమంలో భాగంగా తీసుకున్న వీడియోను నెట్టింట షేర్ చేశారు. ఇందులో వీరిద్దరు ఒకరికొకరు రొమాన్స్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఒకరికొకరు ముద్దులు పెట్టుకుని గట్టిగా హత్తుకుంటున్నారు. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు.. నాలుగు గోడల మధ్య జరగాల్సిన కార్యాన్ని బహిరంగ సమావేశంలా మార్చేశారు. ఇలా చేయడం సంప్రదాయానికే అవమానం అని కొంతమంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరికొంతమంది అనుభవాలను పంచుకోవడంతో తప్పేముంది అంటూ ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story