- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బైక్ రైడింగ్ సమయంలో కుక్క పనికి నెటిజన్ల ఫిదా (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాల తీవ్రత నుంచి తప్పించుకోవచ్చని అధికారులు ఎంత చెప్పినా మనలో కొంతమంది వాటిని అస్సలు పట్టించుకోరు. ముఖ్యంగా ప్రమాదాల సమయంలో ప్రాణాలు నిలిపేందుకు దోహదపడే హెల్మెట్ ధరించే విషయంలో చాలా మది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కానీ ఓ కుక్క మాత్రం తాను ఆదర్శంగా నిలవడంతో పాటు మనుషులందరికి ఓ గొప్ప సందేశాన్ని ఇస్తోంది.
కుక్క హెల్మెట్ ధరించి బైక్‌పై ప్రయాణం చేయడం ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడియోలో ఉన్న వివరాల ప్రకారం ఈ వీడియో తమిళనాడుకు సంబంధించినదిగా తెలుస్తోంది. దీంట్లో ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తుంటే వెనక సీట్లో కుక్కను కూర్చోబెట్టుకున్నాడు. అయితే బైక్ రైడర్‌తో పాటు పాటు కుక్క సైతం హెల్మెట్ ధరించి హాయిగా ప్రయాణాన్ని ఆస్వాదిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లోకి రాగా దీన్ని చూసిన నెటిజన్లు కుక్క మనుషులకు గొప్ప సందేశం ఇస్తోందని కామెంట్స్ పెడుతున్నారు.
Rule is rule..😜#WhatsApp #instagramdown #TamilNadu pic.twitter.com/g47mB5mEfY
— Mohammed Nayeem (@PMN2463) May 23, 2023