సైకిల్ ట్రాక్ కాదు.. ‘బఫెల్లో ట్రాక్‌’ (వీడియో)

by GSrikanth |
సైకిల్ ట్రాక్ కాదు.. ‘బఫెల్లో ట్రాక్‌’ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ హితంగా సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ఇటీవల హైదరాబాద్‌లో నిర్మితమైంది. ఔటర్‌ రింగు రోడ్డు వెంట 23 కిలోమీటర్ల పొడవుతో సైకిల్‌ ట్రాక్‌ను ప్రభుత్వం నిర్మించింది. దీనికి సుమారు రూ.100 కోట్ల వ్యయమైనట్లు, ట్రాక్‌ను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వ చూస్తోంది. కాగా, ఇటీవల మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించి ట్రాక్‌పై సైకిల్ కూడా తొక్కారు.

అయితే, తాజాగా ఈ ట్రాక్‌పై బర్రెలు తీరుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది సైకిల్ ట్రాక్ కాదని, బఫెల్లో ట్రాక్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బర్రెలు తిరుగుతున్న వ్యవహారంపై జీహెచ్ఎంసీకి పలువురు నెటిజన్లు చూడండి అంటూ ట్విట్టర్‌లో వీడియో ట్యాగ్ చేశారు.

Advertisement

Next Story