Viral News: డబ్బు కట్టు.. లైక్ కొట్టు.. మస్క్ సంచలన నిర్ణయం

by Indraja |
Viral News: డబ్బు కట్టు.. లైక్ కొట్టు.. మస్క్ సంచలన నిర్ణయం
X

దిశ వెబ్ డెస్క్: ట్విట్టర్ (X) అధినేత ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్‌లో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళు నామమాత్రపు ఫీజు చెల్లించాలని తాజా ప్రకటన చేశారు. ఇకపై ట్విట్టర్‌లో లైక్, రిపోర్ట్, రిప్లై, బుక్ మార్క్ చెయ్యాలి అని అనుకుంటే ఈ ఫీజు తప్పని సరిగా చెల్లించాలని పేర్కొన్నారు. కాగా ఫేక్, స్పామ్ అకౌంట్లను నియంత్రించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మాస్క్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో టెస్టింగ్ లో ఉంది. కాగా అక్కడ ఈ పాలసీ వర్కౌట్ అయితే రానున్న రోజుల్లో భారత్ లోనూ అమలు కావొచ్చు.

Advertisement

Next Story