- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Viral: ఆ తత్వం మనిషికి లేకపాయే!.. ఊర పిచ్చుకకు సీపీఆర్ చేసి కాపాడిన మరో పిచ్చుక
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ ఊర పిచ్చుక తన తోటి పిచ్చుకకు సీపీఆర్ చేసి బ్రతికించుకున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ రోజుల్లో మనిషి తోటి మనుషులకు సాయం చేయాలంటేనే ఆలోచిస్తున్నారు. రోడ్డుపై ఎవరైనా పడిపోతే చూస్తూ వెళుతున్నారే తప్ప సాయం చేద్దాం అనే కనీస మానవత్వం లేకుండా పోతుంది. అలాంటిది ఓ ఊరపిచ్చుక తన తోటి పిచ్చుక ప్రాణాలతో విలవిలలాడటం చూడలేకపోయింది. శ్వాస ఆగక కొన ఊపిరితో పడి ఉన్న పక్షికి ప్రాణం పోయాలని ఆరాటపడింది. తోటి ప్రాణిని బ్రతికించాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. మనుషులకు సీపీఆర్ చేసినట్టుగా ఆ పిచ్చుకను అటు ఇటు కదిలించి, తన నోటితో పొడుస్తూ.. ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పిచ్చుకకు ఊపిరి పోసింది. ఆకరికి ఆ పిచ్చుక ఎగిరి పోవడం చూసి ఆనందంతో అక్కడి నుంచి పరుగులు తీసింది. దీనిని ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆ ఊర పిచ్చుక ప్రయత్నాన్ని కొనియాడుతున్నారు. అంతేగాక ఆ పిచ్చుకకు ఉన్న తత్వం మనుషులకు లేకపోయే అని, సీపీఆర్ చేసింది కాపాడిందంటే, ఆ పిచ్చుక దొంగచాటుగా గుండెకు సంబందించిన క్లాసులు వింటుంది కావచ్చు అని ఫన్నీగా స్పందిస్తున్నారు.