వాలెంటైన్స్ డే స్పెషల్ .. ఆ గిఫ్ట్ ఖరీదు రూ. 3.68 లక్షలు.. షాక్ లో మహిళ

by Hamsa |
వాలెంటైన్స్ డే స్పెషల్ .. ఆ గిఫ్ట్ ఖరీదు రూ. 3.68 లక్షలు.. షాక్ లో మహిళ
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో టెక్నాలజీకి బానిసలయి ఎక్కువగా ఆన్‌లైన్‌లో పరిచయాలు పెంచుకుంటున్నారు. ఆ పరిచయాన్ని కొంత మంది ప్రేమగా మార్చుకుని పెళ్లి వరకు కూడా వెళ్తున్నారు. ఇలాగే ముంబైకి చెందిన ఓ 51 ఏళ్ల మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో లారెంజో అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో పరిచయం కాస్త పెరిగి వాట్సాప్ నెంబర్లు కూడా తీసుకున్నారు. రోజూ చాట్ చేసుకుంటుండగా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే వస్తుందని గిఫ్ట్ పంపుతానని అతడు వివాహితను నమ్మించి అడ్రస్ అడిగాడు.

అతడి మాటలు నమ్మిన మహిళ ఇంటి అడ్రస్‌ను తెలిపింది.దీంతో లోరేంజోను నమ్మిన ఆమె వివరాలను పంపింది. అయితే ఆ తర్వాత మరో వ్యక్తి ఫోన్ చేసి పార్శిల్ పర్మిట్ అంటూ పైసల్ తీసుకున్నాడు. లోరేంజో గిఫ్ట్‌లో యూరోపియన్ కరెన్సీ ఉందని చెప్పి మనీలాండరింగ్ కేసు రాకుండా అని చెప్పి ఇద్దరు కలసి విడతల వారిగా ఏకంగా రూ. 3. 68 లక్షలు కొట్టేశారు. చివరికి విషయం తెలుసుకున్న మహిళకు తాను మోసపోయానని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story