- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుమారి ఆంటీ విషయంలో.. మీడియాను ఉతికారేసిన సామన్య మహిళ (వీడియో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: ‘కుమారి ఆంటీ’.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌లో ఉన్న పేరు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఫుట్‌పాత్‌పై భోజనం అమ్ముకుంటూ సోషల్ మీడియా పుణ్యమా అని అందరికీ సుపరిచితమైంది. ఈ క్రమంలో ఆమె ప్రిపేర్ చేసే ఫుడ్ టేస్ట్ చేసేందుకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఆమె స్టాల్ వద్దకు వస్తున్నారు. దీంతో స్టాల్ వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో రోడ్లపై రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఫుడ్ స్టాల్ ఎత్తివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ, మళ్లీ సోషల్ మీడియాలో కుమారికి వస్తున్న రెస్పాన్స్ చూసిన సీఎంవో అధికారులు విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రభుత్వం కుమారి ఆంటీకి ఊరటనిస్తూ కీలక ప్రకటన చేసింది. ఆమె ఎక్కడైతే ఫుట్ పాయింట్ పెట్టుకున్నారో అక్కడే మళ్లీ యథావిథిగా భోజనం అమ్ముకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అనుమతిని ఇచ్చారు.
అయినా, కుమారి ఆంటీ స్టాల్ వద్ద రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. యథావిధిగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతూనే ఉంది. ఈ క్రమంలో ఓ మహిళ కుమారి ఆంటీని ప్రమోట్ చేస్తున్న మీడియాపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ‘మీడియా వాళ్లు ఇక్కడికి ఎవ్వరూ రాకండి, ఆమెను హైలెట్ చేయకండి. రోడ్డు మీద వ్యాపారాలు చేసుకుంటున్న తమను కుదురుగా బతకనివ్వండి అని అన్నారు. అందుకు మీడియా మిత్రుల మీ.. వృత్తి అది, మా వృత్తి ఇది అని సమాధానమిచ్చారు. అందుకు కౌంటర్‌గా సదరు మహిళ ‘దేశంలో చాలా సమస్యలున్నాయ్, అన్యాయాలు, ఆడపిల్లలపై అకృత్యాలు, డ్రగ్స్, గంజాయి రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అక్కడి వెళ్లి ప్రశ్నించండి అంటూ నిలదీశారు. ఇక్కడికొచ్చి చికెన్, చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి బాగుందా.. ఇవేనా మీరు చేసే రిపోర్టింగ్ అంటూ మండిపడ్డారు. దీంతో అక్కడున్న యూట్యూబ్ చానల్ రిపోర్టర్లు ఏం మాట్లాడాలో తెలియక తెలియక తడబడ్డారు. ప్రస్తుతం ఆ మహిళ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రోడ్డు మీద బతికే మమ్మల్ని బతకనివ్వండి pic.twitter.com/jqQS3eudAP
— Telugu Scribe (@TeluguScribe) February 4, 2024