- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్క్‌లో భయంకరమైన స్లైడర్.. ఓపెన్ అయిన గంటలో మూసేశారు! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః నగరాల వ్యాప్తి, జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఆహ్లాదం కోసం పార్కులు ఆనివార్యమయ్యాయి. దీనితో కొత్త కొత్త మార్గాల్లో ప్రజల్ని ఆకర్షించడానిక ఎమ్యూజ్‌మెంట్ పార్కులు క్రేజీ రైడింగ్‌లను అందిస్తున్నాయి. ఈ క్రమంలో, U.S.లోని మిచిగాన్ రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన డెట్రాయిట్ నగరంలోని పార్క్‌లో ఒక భారీ స్లైడ్ నిర్మించారు. అయితే, శుక్రవారం దీన్ని ఓపెన్ చేయగా, మరో గంట వ్యవధిలోనే మూసేయాలని అధికారులు ఆదేశాలిచ్చారు.
ఈ భయంకరమైన స్లైడ్‌పైన గోనె సంచులు ధరించి, కొందరు ఔత్సాహికులు జారుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో స్లైడ్ పైనుండి జారుతున్న వ్యక్తులు ప్రమాదకరంగా గాలిలోకి విసిరివేయబడి, కిందకి పడటం, స్లైడింగ్ పూర్తయ్యే ప్రదేశం సౌకర్యవంతంగా లేకపోవడం, అంతకుమించి ఎగిరిపడుతున్న వ్యక్తులు ఈ భారీ స్లైడ్ మెటల్ బాడీకి తగులుతూ గాయపడే అవకాశాలు ఉండటంతో దీన్ని ప్రమాదకరంగా గుర్తించారు. దీనితో నిర్వాహకులు సర్దుబాటు చర్యలకు దిగారు. వేగం తగ్గించి, వంపులను కాస్త సరిచేసి, వినియోగదారులకు మరింత ఆనందం ఇచ్చే విధంగా స్లైడ్‌ను మారుస్తామని పార్క్ నిర్వాహకులు తమ ఫేస్‌బుక్ పేజీలో శనివారం తెల్లవారుజామున ఒక ప్రకటన విడుదల చేశారు.
The giant slide at Belle Isle Park in Michigan was open for only 4 hours before workers shut it down to make adjustments.
— Art (@artcombatpod) August 19, 2022
I wonder why they decided to do such a thing 😳 pic.twitter.com/q7jpFdLdAO