వీడికి భయం లేదు.. భక్తి లేదు! దండం పెట్టి మంగళసూత్రం చోరీ

by Ramesh N |   ( Updated:2024-04-09 14:28:01.0  )
వీడికి భయం లేదు.. భక్తి లేదు! దండం పెట్టి మంగళసూత్రం చోరీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుడిలో ఎవరూ లేని సమయంలో కొందరు వ్యక్తులు భక్తుడిలా వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారు. గుడిలో హుండీ, దేవుని ఆభరణాలు, ఇతర వస్తువులు దోచుకోని పోయిన ఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ గుడిలోకి భక్తుడిలా వచ్చిన వ్యక్తి చోరి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏలూరు సత్రంపాడు సౌభాగ్యలక్ష్మీ గుడిలో తాజాగా చోరీ జరిగింది. దర్శనం కోసం గుడిలోకి వచ్చిన ఓ వ్యక్తి.. అమ్మవారి మెడలో ఉన్న పది కాసుల మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లిపోయాడు.

అమ్మవారికి ముందుగా దండం పెట్టి.. అటు ఇటు చూసి గర్భగుడిలోకి వెళ్లీ అమ్మవారి మంగళసూత్రం కాజేస్తాడు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అతను దొంగతనం చేసే సమయంలో మాస్క్ ధరించి ఉన్నాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వీడియో పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. దొంగకు భయం, భక్తి లేదని నెటిజన్లు ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story