Video viral:తలకొరివి పెడుతుండగా చితిలో నుంచి లేచిన బామ్మ.. బిత్తరపోయిన బంధువులు

by Jakkula Mamatha |
Video viral:తలకొరివి పెడుతుండగా చితిలో నుంచి లేచిన బామ్మ.. బిత్తరపోయిన బంధువులు
X

దిశ,వెబ్‌డెస్క్: తమిళనాడులో తిరుచ్చిలో విచిత్ర ఘటన జరిగింది. అనారోగ్యంతో మృతి చెందిన ఓ ముసలావిడను స్మశానంలో దహన సంస్కారాలు చేసేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో బంధుజనం చివరిగా బామ్మను చూసి దుఃఖిస్తున్నారు.. ఓ వైపు బంధుజనం బాధతో ఉండగా విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల కిందట చిన్నమ్మాళ్(62) అనే వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోయారని బంధువులు భావించారు. పల్స్ కూడా లేకపోవడంతో స్మశానంలో దహన సంస్కారాలకు సిద్ధం చేయగా చితిలో నుంచి ఆమె మంచినీళ్లు అడగడంతో అందరూ షాకయ్యారు. పలువురు భయంతో పరుగులు పెట్టారు. తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Advertisement

Next Story

Most Viewed