సింహం బారి నుంచి తన బిడ్డను కాపాడిన జిరాఫీ (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-13 14:59:16.0  )
సింహం బారి నుంచి తన బిడ్డను కాపాడిన జిరాఫీ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: జిరాఫీ పిల్లపై కన్నేసిన ఓ సింహం ఒక్క సారిగా దానిపై దాడి చేసింది. ఇది గమనించిన తల్లి జిరాఫీ వెంటనే సింహంపైకి దూసుకెళ్లింది. దీంతో భయపడిన సింహం పిల్ల జిరాఫీని వదిలేసింది. కాగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. మనుషులకే కాదు.. జంతువులకు ప్రేమ వర్తిస్తుందని తల్లి జిరాఫీ ప్రూవ్ చేసింది. మైదాన ప్రాంతంలో ఉన్న జిరాఫీ పిల్లపై ఓ ఆడ సింహం దూకి దాని మెడను పట్టుకుంది.

తప్పించుకోవడానికి జిరాఫీ పిల్ల ఎంత ప్రయత్నించినా వదలలేదు. ఇది గమనించిన తల్లి జిరాఫీ పరుగెత్తుకుంటూ వచ్చి సింహంపై దాడికి దిగింది. సింహం తన కంటే బలమైనదని తెలిసినా తెగువ చూపి తన బిడ్డపై మమకారాన్ని చాటుకుంది. తల్లి జిరాఫీ రాకను గమనించిన ఆడ సింహం అక్కడి నుంచి వెల్లిపోయింది. ఈ వీడియోను యానిమల్ వరల్డ్ 11 తన ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రాణాలకు తెగించి తల్లి జిరాఫీ చేసిన పోరాట పటిమను నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story