Trending: ఇదెక్కడి మాస్‌ రా మామ.. వరల్డ్ కప్ విన్నింగ్ క్యాచ్‌ మూమెంట్‌తో గణేష్ మండపం!

by Prasanna |   ( Updated:2024-09-12 08:13:42.0  )
Trending: ఇదెక్కడి మాస్‌ రా మామ.. వరల్డ్ కప్ విన్నింగ్ క్యాచ్‌ మూమెంట్‌తో గణేష్ మండపం!
X

దిశ, వెబ్ డెస్క్: హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి యేటా భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిధిని వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ మాసాన్ని గణేషుడుకు అంకితం చేసారని పురాణాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఏడాది గణేష్ చతుర్థి పండగ సెప్టెంబర్ 7 న వచ్చింది. ఆ రోజున గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాధారణంగా చాలా మంది గణపతి నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు ఉదయం, సాయంత్రం పూజలు చేసి తొమ్మిదవ రోజున విగ్రహ నిమజ్జనం చేస్తారు.

ఇక వినాయక చవితి పండుగ వచ్చిందంటే అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఈ క్రమంలోనే గుజరాత్ లో ఏకంగా క్రికెట్ సెట్ యే వేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ ఫ్యాన్స్ తయారు చేసిన ఓ స్టేడియం లాంటి సెట్ నెట్టింట వైరల్‌ అవుతుంది.

టీ20 ప్రపంచకప్ 2024‌ టైటిల్‌ను మన ఇండియా టీం గెలుచుకున్న సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ లో చివరి బాల్ వరకు టెన్షన్ గా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో కప్పు కొట్టింది. 17 ఏళ్ల తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీని గెలుచుకుని ప్రతి యొక్క భారతీయుడిని గర్వ పడేలా చేసింది. ఇటీవలే జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టిన థీమ్‌తో ఈ మండపాన్ని నిర్మించడం గొప్ప విశేషం.. అసలు ఈ ఆలోచన వచ్చిన వారికీ సెల్యూట్ చేయాలి.. వినాయకుడు కూర్చొని మ్యాచ్ చూస్తున్నట్టుగా గుజరాత్‌లోని క్రికెట్ ఫ్యాన్స్ ఈ మండపాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు.

For Tweet link : https://x.com/RAnugrah707/status/1833662491542577389

Advertisement

Next Story