- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Odisha : అమ్మా.. లే అమ్మా.. పాపం పిల్ల ఏనుగు! హృదయ విదారకర ఘటన.. వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశా అభయారణ్యంలో ఓ హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. ఓ పిల్ల ఏనుగు చనిపోయిన తన తల్లి మృతదేహం వద్ద నిలబడి రోదిస్తున్న హృదయ విదారక దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఒడిశాలోని కియోంజర్ అభయారణ్యంలో వయసు సంబంధిత వ్యాధులతో ఓ ఆడ ఏనుగు చనిపోయింది. దీంతో పిల్ల ఏనుగు తల్లి చుట్టూ తిరుగుతూ తొండంతో తడుతూ లేపేందుకు ప్రయత్నించింది. దాదాపు ఒక రోజు పాటు తల్లిని లేపడానికి ప్రయత్నించిందని, ఇక తల్లి లేవదని అర్థం చేసుకుని దు:ఖంతో తిరిగి అడవిలోకి వెళ్లిపోయిందని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఫోటోలను పోస్ట్ చేశారు.
ఈ ఘటన ఫొటోలు నెటిజన్లను కదిలిస్తున్నాయి. ప్రేమానురాగాలు మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఉంటాయనే దానికి ఇది నిదర్శనమని ఇది చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. అమ్మా.. లే అమ్మా.. పాపం పిల్ల ఏనుగు ఎంత దుఖంలో ఉందోనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తల్లి ఏనుగు చనిపోయిన విషయం అటవీశాఖ అధికారుల దృష్టికి ఇటీవల వచ్చింది. ఘటన స్థలానికి చేరుకోని ఎలా చనిపోయిందనే విషయంపై పోస్ట్‌మార్టం నిర్వహించారు. తల్లి ఏనుగు వృద్ధాప్యం కారణంగా మరణించిన సహజ మరణ కేసుగా అటవీ శాఖ పేర్కొంది. ప్రాథమిక విచారణ అనంతరం ఏనుగు మృతదేహాన్ని అడవిలో పూడ్చిపెట్టారు. రాష్ట్రంలోని ఆనంద్‌పూర్ వన్యప్రాణి విభాగానికి చెందిన అధికారి ఏకే దలే ఈ విషయంపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని సూచించారు.