Dogs: ఇక పై అక్కడ కుక్కలను పెంచే వాళ్లు ఈ రూల్స్ పాటించాలిసిందేనట!

by Prasanna |
Dogs: ఇక పై అక్కడ  కుక్కలను పెంచే వాళ్లు ఈ రూల్స్ పాటించాలిసిందేనట!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంటికి కాపలా కోసం కుక్కను పెంచుతుంటారు. వీటిని పెంచుకునేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని ఖచ్చితంగా పాటించాలంటున్నారు అధికారులు.

మూగజీవులపై ప్రేమతో చాలా మంది ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు. వేర్వేరు జాతులకు చెందిన కుక్కలను ఎక్కువ ఖర్చు పెట్టి మరి తెప్పించుకుంటారు. ఇలా పెంచుకోవడం తప్పు కాదు.. కానీ వీటి వల్ల సమాజంలో ఉన్న వాళ్లకు ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలి. ప్రస్తుతం నోయిడా అథారిటీ ఈ విషయాల గురించి కుక్కలను పెంచుకునే యజమానులకు కొన్ని రూల్స్ ను పెట్టింది. పెంపుడు కుక్క ఎవరినైనా కరిస్తే రూ. 10 వేలు ఫైన్ కట్టాలని కొత్త రూల్ పెట్టింది.

పెంపుడు కుక్కలను ఎవరైతే పెంచుకుంటున్నారో వారి పేర్లను నమోదు చేసుకోవాలని,పెట్ డాగ్స్‌కి సంబంధించిన వివరాలతో తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ రూల్స్ ఎవరు పాటించక పోయిన వారు ప్రతి నెల రెండు వేల రూపాయల ఫైన్ కట్టాల్సి వస్తుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed