- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రాడ్యుయేషన్‌లో డిప్లొమా పట్టా అందుకున్న కుక్క.. వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుకున్న విద్యార్థులకు యూనివర్శిటీ డిగ్రీ పట్టా అందచేస్తుంది. కానీ, ఓ సునకం ఎప్పుడైన డిగ్రీ పట్టా అందుకోవడం మీరు ఎప్పుడైనా చుశారు. తాజాగా ఇలాంటి విచిత్ర సంఘటనే అమెరికాలో జరిగింది. తన యజమానీతో పాటు ప్రతీ తరగతికి హాజరవుతున్న కుక్క సైతం డిగ్రీ పట్టా అందుకోవడం ప్రస్తుతం అందరని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
న్యూజెర్సీలోని సెటన్ హాల్ యూనివర్సిటీలో జోసెఫ్ నైర్ గ్రేస్ మరియాని అనే అమ్మాయి డిగ్రీ పూర్తి చేసుకుంది. అయితే ఆ అమ్మాయి వీల్ చైర్‌లో తన యూనివర్సిటీకి వచ్చేది. ఆమెకు సహాయంగా జస్టీస్ అనే శునకం ఉండేది. ఆ అమ్మాయితో పాటు శునకం కూడా రోజు క్రమం తప్పకుండా తరగతికి హాజరయ్యేది. దీంతో జస్టీస్ అంకితభావాన్ని గుర్తించి యూనివర్శిటీ.. ఇది చాలా అరుదైన విషయం అంటూ ప్రశంసించారు. అంతే కాకుండా యజమానితో పాటు కుక్కకు సైతం డిగ్రీ పట్టాను అందజేశారు. ప్రస్తుతం ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. నెటిజన్ల ప్రశంసలు కూడా అందుకుంటోంది జస్టీస్.