నీతా అంబానీ, ధీరుభాయ్ అంబానీ ఇంట పెద్ద కోడలిగా ఎలా అడుగు పెట్టిందో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-07-09 10:21:48.0  )
నీతా అంబానీ, ధీరుభాయ్ అంబానీ ఇంట పెద్ద కోడలిగా ఎలా అడుగు పెట్టిందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : నీతా అంబానీ గురించి అందరికి తెలిసే ఉంటుంది. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ భార్య గానే కాక సామాజిక సేవ కార్యకర్తగా ఎంతో మందికి పరిచయం. క్రీడలు పట్ల ఎక్కువ మక్కువ.వీటితో పాటుగా దక్షత కలిగిన మహిళ, వ్యాపారవేత్త కూడా.. ధీరుభాయ్ అంబానీ ఇంట పెద్ద కోడలిగా అడుగు పెట్టి.. ఇక చాలు అనుకోలేదు అన్నిటా విలక్షణ మైన బాధ్యాతాయుతమైన మహిళగా, ఇల్లాలిగా తనకు తానుగా నిరూపించుకున్నారు. ముగ్గురు పిల్లల తల్లి . అందర్ని చక్కగా పెంచి పెద్ద చేసింది. ఆమె ఇప్పటికి ఆరోగ్యంగా ఉండి ఇంటి పనులు, వ్యాపార పనులు స్వయంగా చక్క బెట్టుకుంటారు. అలాగే వారికున్న డబ్బును దాచుకునే ప్రయత్నం చేయరు. ఆమె ఇంటిలో టీ కప్పు మొదలు మాట్లాడే సెల్ ఫోన్ వరకు అందరు దాని గురించే చర్చించుకుంటారు.

ముంబై గణేష్ మందిరానికి వెళ్లడం సాధారణం అనుకుంటే హైద్రాబాద్ ఎల్లమ్మ బోనాలు ఎత్తుకొని తరచూ వస్తుంటారు. సాధారణంగా జనాల్లో ఉండే ఆసక్తి ఏంటి అంటే.. ఇంత వయస్సులో కూడా ఆమె ఆరోగ్యంగా , ఆనందంగా , అందంగా ఉండటానికి కారణం ఏమిటా అని గూగుల్లో సెర్చ్ చేశారట. నీతా అంబానీ 1963,నవంబర్ 1 న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి బిర్లా కంపెనీలో పని చేసేవారు, తల్లి గృహిణి.ఆమెకు డిజైనింగ్, నృత్యం అంటే చాలా ఇష్టం. ఆమె నృత్యాన్ని అందరు మెచ్చుకున్నారు. అదే ఆమెను అంబానీ కుటుంబానికి పరిచయం చేసింది. ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ కంపెనీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయనకు ముఖేష్ , అనిల్ ఇద్దరు కొడుకులు. బిర్లా సంస్థ వారి ఒక ప్రోగ్రాంలో నీతా భరత నాట్యం చేసింది. అక్కడ ధీరుభాయ్ అంబానీ చూసి మెచ్చుకొని తన పెద్ద కొడుకు ముఖేష్ అంబానీకి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకొని వివాహం చేశారట.

Advertisement

Next Story