నా భర్తకు విడాకులు ఇచ్చా.. పెళ్లి ఫొటోల డబ్బులు వాపస్ ఇచ్చెయ్..! ఫొటోగ్రాఫర్‌కు యువతి వార్నింగ్

by Hamsa |
నా భర్తకు విడాకులు ఇచ్చా.. పెళ్లి ఫొటోల డబ్బులు వాపస్ ఇచ్చెయ్..! ఫొటోగ్రాఫర్‌కు యువతి వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల చాలా మంది పెళ్లి ముందే ఫ్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ జరుపుకుంటున్నారు. అంత డబ్బు పెట్టి ఫొటో షూట్ చేసుకుని తమ మదుర క్షణాలను అద్భుతంగా రావాలని ఫొటో గ్రాఫర్లను నియమించుకుని తమ భాగస్వామితో ఫొటోలు దిగుతారు. అయిన తర్వాత ఏవో మనస్పర్థల వల్ల పెళ్లిని పెటాకులు చేసుకుని విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవల ఓ మహిళ విడాకులను సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఓ యువతి భర్తతో విడాకులు తీసుకుని తన పెళ్లికి ఫొటోలు తీసిని ఫొటో గ్రాఫర్‌ను డబ్బులు రీఫండ్ చేయమని మేసేజ్‌లు పంపింది.

వివరాల్లోకి వెళితే.. 2019లో ఓ యువతి పెళ్లి చేసుకుంది. అయితే భర్తతో ఏవో కారణాల వల్ల విడిపోయింది. దీంతో పెళ్లికి తీసిన ఫొటోలు వద్దని ఫొటోగ్రాఫర్‌ను డబ్బులు రీఫండ్ చేయమని సోషల్ మీడియా వేదికగా అడిగింది. ఫొటో గ్రాఫర్ అది జోక్ అనుకున్నాడు. కానీ, ఆ యువతి సీరియస్‌గా చెప్తూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆ చాట్‌ను అతను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అందులో ‘నా వివాహం నేను ఊహించిన విధంగా జరగలేదు. ఇప్పుడు అది నాకు ఒక పీడ కలలా మిగిలింది. అందుకే ఫోటోషూట్‌ డబ్బులు రీఫండ్ చేయాలని కోరుతున్నా’ అని ఆ యువతి అతనికి మెసేజ్ చేసింది. ఫోటోగ్రాఫర్ తాను ఆ డబ్బులను తిరిగి ఇవ్వలేనని చెప్పగా.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె బెదిరించింది. ఈ చాట్ కాస్త వైరల్‌గా మారడంతో ఆ యువతి మాజీ భర్త ఎంట్రీ ఇచ్చాడు. ఆమె ప్రవర్తనకుగాను ఫొటోగ్రాఫర్‌కు క్షమాపనలు చెప్పాడు. ప్రస్తుతం వీరికి సంబంధించిన చాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story