Devout: దొంగలకు కూడా భక్తి ఉంటుంది! దండం పెట్టి దేవుని కిరీటం లేపేశాడు!

by Ramesh N |
Devout: దొంగలకు కూడా భక్తి ఉంటుంది! దండం పెట్టి దేవుని కిరీటం లేపేశాడు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో అక్కడక్కడ దేవుడి గుళ్లలో దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. భక్తుల పర్సులు, ఫోన్లే కాకుండా.. ఏకంగా దేవుడి ఆభరణాలు, హుండీ లాంటి ఇతర వస్తువులు దొంగలు ఎత్తుకెళ్తుంటారు. అయితే, తాజాగా ఓ దొంగ కొత్త స్టైల్లో ఓ గుడిలో దొంగతనం చేశాడు. దానికి సంబంధించిన సీసీ వీడియో చూసి పూజారుల నుంచి పోలీసుల వరకు అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే దేవుడికి దండం పెట్టి.. దేవుడి కిరీటాన్ని దొంగిలించాడు.

మహారాష్ట్ర ముంబాయిలోని విఠలేశ్వరుడి ఆలయంలోకి దొంగతనానికి ఓ దొంగ వెళ్లాడు. గుడిలోని దేవుడి విగ్రహం ముందు దొంగ నిల్చొని దండం పెట్టి అనంతరం దేవునిపై ఉన్న వెండి కిరీటాన్ని తీసుకొని పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ పూటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంత మంది దొంగలకు కూడా దేవుడిపై భక్తి ఉంటుందని, సంప్రదాయాలు కూడా పాటిస్తారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.



Next Story