Trending: వారెవ్వా నెమలి పింఛాలతో గణేషుడు.. దర్శించేందుకు ఎగబడుతోన్న భక్తులు

by Prasanna |   ( Updated:2024-09-12 04:24:37.0  )
Trending: వారెవ్వా నెమలి పింఛాలతో గణేషుడు.. దర్శించేందుకు ఎగబడుతోన్న భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి యేటా భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిధిని వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ మాసాన్ని గణేషుడుకు అంకితం చేసారని పురాణాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఏడాది గణేష్ చతుర్థి పండగ సెప్టెంబర్ 7న వచ్చింది. ఆ రోజున గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాధారణంగా చాలా మంది గణపతి నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు ఉదయం, సాయంత్రం పూజలు చేసి తొమ్మిదవ రోజున విగ్రహ నిమజ్జనం చేస్తారు.

ప్రస్తుతం వినాయక పండుగ వాతావరణం అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. మన ఇళ్లలో చేసే ఏ శుభ కార్యాలైనా గణపతి పూజ తర్వాతే మిగిలిన పనులు చేస్తారు. ఇక వినాయక చవితి పండుగ వచ్చిందంటే అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఈ నేపథ్యంలోనే వనస్థలిపురంలోని కమ్యూనిటీ హాలులో నెమలి పింఛాలతో గణేషుడిని తయారు చేశారు. మొత్తం 11,116 నెమలి పింఛాలతో అద్భుతంగా రూపొందించారు. ఈ విగ్రహం చుట్టుపక్కల వారిని, భక్తులను ఆకట్టుకుంటోంది. ఒక్కసారి ఆ నెమలి కన్నుల వినాయకుడిని చూసి దర్శనం చేసుకుందామని భక్తులు ఎగబడుతున్నారు. అక్కడికి వెళ్లి చూసిన వారు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed