- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Snake Inside Fan: వామ్మో.. ఫ్యాన్‌లో చిక్కుకున్న భయంకరమైన పాము.. రక్షించిన వాలంటీర్స్
దిశ, డైనమిక్ బ్యూరో: విషం ఉన్నా.. లేనివైన పాములు అంటే దాదాపు అందరికీ భయమే. అలాంటింది ఒక పాము ఇంట్లోకి వచ్చిందంటే దాన్ని బయటకు పంపించే దాకా వదలం. అయితే తాజాగా మహారాష్ట్రలోని పూణెలో ఓ ఇంట్లోకి ప్రవేశించిన విషపూరిత పామును కాపాడిన వీడియో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. పూణెలోని వాగ్లే ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలోని ఓ ఆపార్ట్‌మెంట్ ఇంట్లో ‘ఫోర్‌స్టెన్ క్యాట్ స్నేక్’ అనే విషపూరిత పాము వచ్చింది. ఇది గమనించిన ఆపార్ట్‌మెంట్ వాసులు వెంటనే ‘రెస్‌కింక్ అసోసియేషన్ ఫర్ వైల్డ్‌లైఫ్ వెల్ఫేర్’కు కాల్ చేశారు. దాదాపు 3.5 అడుగుల పొడవు ఉన్న ఆ పాము ఏకంగా గోడకు అమర్చిన ఫ్యాన్‌లోకి వెళ్లి చిక్కుకుపోయింది. ఇది గమనించిన వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ వాలంటీర్స్ చిక్కుకుపోయిన పామును సురక్షితంగా రక్షించారు. తర్వాత అటవీ శాఖ సహాయంతో ఆ పాము ఉండే ప్రదేశంలో వదిలివేశారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. విషపూరితమైన పాములు.. ప్రత్యేకంగా వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పామును కాపాడినందుకు ఎక్కువగా మంది నెటిజన్లు వాలంటీర్లకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ‘హైదరాబాద్‌లో మాకు స్నేక్స్ సొసైటీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇళ్లలో, చుట్టుపక్కల ఏదైనా పాములు కనిపిస్తే, వారిని పిలిస్తే, వారు వచ్చి వాటిని రక్షించి సుదూర అడవిలో వదిలివేస్తారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.