రొడ్డెక్కిన మరో జంట.. బైక్‌పై హద్దుమీరి రొమాన్స్ (వీడియో)

by Ramesh N |   ( Updated:2024-05-23 14:15:39.0  )
రొడ్డెక్కిన మరో జంట.. బైక్‌పై హద్దుమీరి రొమాన్స్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ మధ్య కొంతమంది ప్రేమ జంటలు బైక్‌పై రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. పబ్లీక్‌గానే హద్దులు దాటుతున్నారు. అదేదో ఫ్యాషన్, ట్రెండ్ అన్నట్లుగా బైక్ ముందు భాగంలో అమ్మాయిని కూర్చోబెట్టి అసభ్యకర చేష్టలతో వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా బైక్‌పై మరో జంట రెచ్చిపోయిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజస్థాన్‌లో ఓ జంట రాత్రి సమయంలో నడి రోడ్డుపై బైక్‌పై స్పీడ్‌గా వెళ్తు రోమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కారు. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు దీన్ని వీడియో తీశారు.

ఇందులో ఓ యువకుడు పెట్రోలో ట్యాంక్‌పై అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టుకుని బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. అంతా చూస్తుండగానే యువతీ ఆ యువకుడిని కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం కన్పిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీరిద్దరి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ జంటపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్‌ పోలీసులను ట్విట్టర్ వేదికగా చేశారు.

Click Here For Twitter Post..

Advertisement

Next Story