కూలిపోయిన బంగారు గని.. మట్టికుప్ప నుంచి ప్రాణాలతో తప్పించుకున్న మైనర్లు (వీడియో)

by Mahesh |   ( Updated:2024-06-29 16:00:32.0  )
కూలిపోయిన బంగారు గని.. మట్టికుప్ప నుంచి ప్రాణాలతో తప్పించుకున్న మైనర్లు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కాంగోలో ఓ బంగారు గనిలో వర్షం కారణంగా మట్టి కుప్పలు కూలీ పోయాయి. దీంతో 9 మైనర్లు గనిలో చిక్కుకున్నారు. కొద్దిసేపటికి వారు మట్టి కుప్ప నుంచి బయటకు చొచ్చుకుని రావడం వీడియోలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వీడియోలో శిథిలాల కింద చిక్కుకున్న తొమ్మిది మైనర్లు బంగారు గని నుంచి మంటి నుండి చొచ్చుకుని బయటకు రావడం కనిపించింది. దీంతో ఆ వీడియోను చూసిన నెటిజన్లు వారికి ఇది పునర్జన్మ అని కామెంట్ చేస్తున్నారు.

Click Here For Video Post..

Advertisement

Next Story