ఓపెన్ ఎగ్‌లో పుట్టిన కోడిపిల్ల.. వైరల్ వీడియో

by Anjali |
ఓపెన్ ఎగ్‌లో పుట్టిన కోడిపిల్ల.. వైరల్ వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని విచిత్రమైన వీడియోలు దర్శనమిస్తున్నాయి. అయితే అలాంటిదే ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓపెన్ గా ఉన్న గుడ్డులో కోడి పుల్ల పుట్టడం ఆ వీడియోలో కనిపిస్తుండగా ఇది చూసిన నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. అయితే ఆ వీడియోలో ప్లాస్టిక్ కవర్‌లో పడవేసి, చాలా రోజుల తర్వాత పిల్లకోడి బయటకు వచ్చే వరకు పొదిగించడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. సిఎన్‌బీసీ కథనం ప్రకారం... ఓ జపనీస్ విద్యార్థి, గుడ్డులోని కొన్ని చోట్ల పిండంలో ఏదో ఇంజెక్ట్ చేస్తున్నట్లు సిరంజిని ఉపయోగించడం వీడియోలో కనిపించింది. పగిలిగిన గుడ్డు నుండి కోడి బయటకు వచ్చే వరకు ఇది మొత్తం 21రోజుల ప్రక్రియను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూపుతుంది. చూసిన చాలా మంది వీడియో ప్రామాణికతను ప్రశ్నించారు.

కానీ మిస్సిస్సిప్పి స్టేట్ యూనివర్శిటీలో పౌల్ట్రీ సైన్స్ ప్రొఫెసర్ అయిన ఈ డేవిడ్ పీబుల్స్ సిఎన్‌బీసీకి ఈ ప్రక్రియ సాధ్యమేనని చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియ వాణిజ్య కోళ్ల పెంపకంలో లేక ఆహారం కోసం కోళ్లను పెంచడంలో ఉపయోగించేది కాదని, ఇది అంత సులభం కాదని కూడా చెప్పాడు. ‘కృత్రిమ వాతావరణంలో వారు చేస్తున్నది సెమీ-పారగమ్యతతో కూడిన విధానం. రక్షణ పూతను అందించడం ద్వారా నీరు పోతుంది. వాయువులు మారవచ్చు’ అని పేర్కొన్నారు. నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీలో తాను ఇలాంటిదే చూశానని తెలిపారు. అలాగే ‘ది డైలీ డాట్‌’ లోని మరొక కథనం ప్రకారం, ఈ రకమైన ప్రక్రియ కనీసం 1971 నాటి శాస్త్రీయ సాహిత్యంలో ప్రస్తావించారని పేర్కొంది. జర్నల్ ఆఫ్ పౌల్ట్రీ సైన్స్ 2014లో ఒక కథనంలో పిండాల నుండి కోళ్లను పెంచే ‘‘షెల్-లెస్’’ పద్ధతి ట్రాన్స్‌జెనిక్ కోళ్లు, పిండం మానిప్యులేషన్స్, టిష్యూ ఇంజనీరింగ్, రీజెనరేటివ్ మెడిసిన్‌లో ప్రాథమిక అధ్యయనాలు పరిశోధనలకు దారితీస్తుందని తెలిపింది. ఈ వీడియోకు దాదాపు 3 మిలియన్ల వ్యూస్,

32,000 లైక్‌లు వచ్చాయి. కాగా.. ఈ ఫుటేజ్ ఇప్పటిది కాదు. దీన్ని 2016లో షేర్ చేశారు. అయితే తాజాగా వైద్య వీడియోల హ్యాండిల్ ద్వారా ట్విట్టర్‌లో మళ్లీ పోస్ట్ చేశారు. ఈ అద్భుతమైన వీడియో చూసిన నెటిజన్లు ఆశ్యర్యపోతూ..మరొక వైపు అనేక ఎమోజీలను పోస్ట్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Advertisement

Next Story

Most Viewed