- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో.. సీలింగ్ ఫ్యాన్ బాబా? ఫ్యాన్‌కున్న ధూళి విభూది!
దిశ, డైనమిక్ బ్యూరో: స్వాములు కొందరూ విచిత్ర వేషాలు వేయడం చూసే ఉంటారు. ఓ స్వామిజీ విచిత్ర వేషం సోషల్ మీడియా వేదికగా సీలింగ్ ఫ్యాన్ బాబా? అంటూ ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. వీడియో చూపించిన ప్రకారం.. బాబా వికలాంగులుడు తను చైర్‌లో కూర్చోని ఉంటారు. ఒక ఐదుగురు కలిసి ఆ బాబాను పైకి లేపుతారు. సీలింగ్ ఫ్యాన్ దగ్గరకు రాగానే బాబా చేయితో ఏదో మంత్రం చదివి తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ రెక్కలను ఆపుతారు.
ఫ్యాన్‌ను తన చేయితో ఆపిన తర్వాత వచ్చిన దుమ్ముని కొందరికి విభూది లాగా పూస్తారు. తర్వాత స్వామిని కిందకు దించుతారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు మాత్రం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. తిరుగుతున్న ఫ్యాన్‌ను ఎవరైనా ఆపగలరని, కానీ తిరుగుతున్న మిక్సి గిన్నెలో వేలు పెట్టి ఆపు అప్పుడు నమ్ముతారని ఓ నెటిజన్ సెటైర్లు వేశాడు. నెక్స్ హెలికాప్టర్ ఫ్యాన్ కి ట్రై చేయండి బాబా గారు అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫ్యాన్ గాలిని ఆపేయాలని వైసీపీని విమర్శిస్తూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.