70 కేజీల బంగారు ఇటుకలతో వధువుకి తులాభారం (వీడియో)

by Hamsa |   ( Updated:2023-08-11 05:45:51.0  )
70 కేజీల బంగారు ఇటుకలతో వధువుకి తులాభారం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో చాలామంది తమ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయేలా వైరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. కొన్ని పెళ్లిలు అవాక్కయ్యేలా కూడా ఉంటాయి. తాజాగా, దుబాయ్‌లో ఇలాంటి ఓ పెళ్లి వేడుకే జరిగింది. వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌లో ఓ కోటీశ్వరుడైన వ్యక్తి వధువుకి బంగారు తులాభారం చేసి కట్నంగా ఇచ్చాడు.

ఏకంగా 70 కేజీల బంగారు ఇటుకలతో పెళ్లి కూతురు బరువును తూచి వరుడికి కట్నంగా అప్పజెప్పాడు. అక్కడ వచ్చిన వారంతా ఆ తంతుని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. కాగా, ఇప్పుడు బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఆ వ్యక్తి కూతురికి భారీగా బంగారం ఇవ్వడంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి : 3 కోట్ల విలువైన లంబోర్ఘిని కారును క్షణాల్లో ధ్వంసం చేసిన యూట్యూబర్ (వీడియో)

Advertisement

Next Story