- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండపై బ్యాటింగ్.. రోడ్డుపై ఫీల్డింగ్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
దిశ, నేషనల్ బ్యూరో : భారత్‌లో క్రీడాభిమానులు క్రికెట్‌ను ఒక మతంలా సీరియస్‌గా ఫాలో అవుతుంటారు. లెజెండ్ ప్లేయర్లను క్రికెట్ దేవుళ్లుగా పిలుస్తుంటారు. ఈ క్రేజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లిన కొందరు యువతుల వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను తన ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌లో షేర్ చేశారు. వీడియోలో ఉన్న యువతులకు క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ‘‘క్రికెట్‌ను భారత్ మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ యువతులు ‘అంచెలంచెలుగా’ క్రికెట్ స్థాయిని పెంచారు’’ అని సరదా కామెంట్ చేశారు. సాధారణంగా క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్ ఉండాలి. వీధుల్లో కూడా ఆడొచ్చు కానీ కొంత అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. కానీ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఉన్న యువతులు ఏకంగా కొండ లోయలు, ఘాట్ రోడ్లపైనా క్రికెట్‌లో సీరియస్‌గా మునిగితేలారు. దీన్నిబట్టి వారికి ఆటపై ఉన్న ఆసక్తి, అభిమానాన్ని మనం అంచనా వేయొచ్చు. ఆనంద్ మహీంద్రా పోస్టుపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ‘‘క్రికెట్ మన రక్తంలోనే ఉంది’’ అని పలువురు కామెంట్ పెట్టగా.. ‘‘ఇలాంటి క్రికెట్ మేమెక్కడా చూడలేదు’’ అని మరికొందరు వ్యాఖ్యానించారు.
India takes cricket to another level.
— anand mahindra (@anandmahindra) January 24, 2024
Or should I say many ‘levels’….
👍🏽🙁 pic.twitter.com/Lhv8BIzw74