Viral Video: జై శ్రీరామ్ చెప్తేనే ఫ్రీ ఫుడ్ అన్న అంకుల్.. చెప్పనన్న మహిళ.. పబ్లిక్ లో న్యూసెన్స్.. తప్పెవరిది?

by Y.Nagarani |
Viral Video: జై శ్రీరామ్ చెప్తేనే ఫ్రీ ఫుడ్ అన్న అంకుల్.. చెప్పనన్న మహిళ.. పబ్లిక్ లో న్యూసెన్స్.. తప్పెవరిది?
X

దిశ, వెబ్ డెస్క్: ఫ్రీ గా ఆహారాన్ని అందిస్తోన్న ఓ అంకుల్.. జై శ్రీరామ్ (Jai Shree Ram) అని చెప్పాలని, అప్పుడే ఆహారాన్ని ఇస్తామని అక్కడికొచ్చిన వాళ్లకు చెప్పారు. ఫుడ్ కోసం వచ్చినవారు అలాగే చెప్పి.. ఆహారాన్ని తీసుకున్నారు. కానీ ముఖానికి ముసుగు కట్టుకుని వచ్చిన ఒక మహిళ మాత్రం అలా చెప్పనని, తనకు మాత్రం ఫుడ్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆ అంకుల్ మాత్రం జై శ్రీరామ్ చెప్పకపోతే ఆహారం ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ముంబైలోని టాటా ఆస్పత్రికి సమీపంలో ఓ వ్యక్తి తన సొంత ఖర్చుతో ఆహారాన్ని పంపిణీ చేశారు. కానీ ఒక్క కండీషన్. ఫుడ్ తీసుకునేవారు జై శ్రీరామ్ చెప్పాలి. ఓకే ఇష్టమైనవారు అది చెప్పి ఆహారం తీసుకున్నారు. ఇష్టం లేని వాళ్లు వెళ్లిపోయారు. కానీ.. ఒక మహిళ మాత్రం తాను జై శ్రీరామ్ చెప్పను కానీ.. ఫుడ్ మాత్రం కావాలంది. ఆమెకు సపోర్ట్ గా మరో వ్యక్తి వచ్చి.. జై శ్రీరామ్ చెప్పనందుకు ఆమెను టెర్రరిస్ట్ అన్నాడని న్యూసెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు.

కానీ.. అక్కడున్నవారు కానీ.. వైరల్ అవుతున్న వీడియోలో కానీ ఆయన మహిళను టెర్రరిస్ట్ అని పిలిచినట్లు లేదు. ఇది చూసిన నెటిజన్లు.. ఆయన డబ్బుతో ఛారిటీ చేస్తున్నాడు కాబట్టి.. ఎవరికివ్వాలో ఎవరికి ఇవ్వొద్దో ఆయన ఇష్టం అంటున్నారు. ఆయన కేవలం జై శ్రీరామ్ అనే కదా చెప్పమన్నారు.. బాంబులు పేల్చమని చెప్పలేదు కదా. కానీ దానిని కూడా కొందరు తప్పుపడుతున్నారని మండిపడుతున్నారు. ఇక్కడ తప్పు జై శ్రీరామ్ చెప్పమన్న అంకుల్ ది కాదని, తనకు చెప్పడం ఇష్టం లేకపోతే వెళ్లిపోకుండా న్యూసెన్స్ క్రియేట్ చేసిన మహిళదే అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed