- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీసా టవర్ వర్సెస్ పైసా టవర్! ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ స్కామ్!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ నడుస్తున్నాయి. ప్రపంచంలోనే నీటిపారుదలశాఖలో జరిగిన అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టు అని కాంగ్రెస్, బీజేపీ నేతలు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కాళేశ్వరంతో పైసా ఉపయోగం లేకపోయినా.. ప్రాజెక్ట్ వల్ల ప్రతి ఏటా తెలంగాణపై పడే భారం 18 వేల కోట్లు అని ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కల్వకుంట్ల కుంటుంబ కమీషన్ల కక్కుర్తికి తెలంగాణ బలి అయిందని మండిపడ్డారు.
అయితే కాళేశ్వరం టాపిక్ ప్రస్తుతం తెలంగాణలో ట్రెండ్ అవుతున్నది. కాళేశ్వరంలో భాగమైనా మేడిగడ్డ బ్యారేజీ పిలర్ల కుంగుబాటు, అన్నారం సరస్వతి బ్యారేజీ వాటర్ లీకేజీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బ్యారేజీకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కట్టడం అయిన లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఇటలీలో ఉందని, క్రాకింగ్ టవర్ ఆఫ్ పైసా.. తెలంగాణలో ఉందని టవర్‌కు పగుళ్లు వచ్చిన ఫోటోను షేర్ చేస్తున్నారు. అయితే పీసా టవర్ ఒకవైపు ఒరిగి ఉంటుంది. ఇది ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటి.