Viral: అగ్గువ అగ్గువ.. రోడ్లపై కుప్పలుగా పోసి అమ్ముతున్న డ్రై ఫ్రూట్స్.. ఎక్కడో కాదు మనదేశంలోనే

by Kavitha |
Viral: అగ్గువ అగ్గువ.. రోడ్లపై కుప్పలుగా పోసి అమ్ముతున్న డ్రై ఫ్రూట్స్.. ఎక్కడో కాదు మనదేశంలోనే
X

దిశ, సినిమా: సాధారణంగా డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల శరీరం శక్తివంతంగా మారి ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా సహకరిస్తాయి. కాబట్టి డైలీ మన ఆహారంలో గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. అలాగే వీటిని ఫాస్టింగ్ టైం లో కూడా తీసుకోవచ్చు. ఇక త్వరలో శ్రావణ మాసం కూడా స్టార్ట్ కాబోతుంది. చాలామంది ఉపవాసంతో పాటు వెజ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి ఈ మాసంలో డ్రై ఫ్రూట్‌కి భారీగా డిమాండ్ ఉంటుంది. కానీ అక్కడ మాత్రం డ్రై ఫ్రూట్స్ చాలా తక్కువ ధరలో అది కూడా రోడ్ల మీద కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతున్నారు. మరి అలా అమ్మే ప్లేస్ ఎక్కడ? ఏంటి అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో కలూపూర్ మార్కెట్ కూరగాయల మార్కెట్‌కు ప్రసిద్ధి గాంచింది. అంతే కాకుండా ఇక్కడ చిన్న, పెద్ద వ్యాపారులు రిటైల్, హోల్ సేల్ ధరలకు డ్రై ఫ్రూట్స్‌ను కూడా విక్రయిస్తుంటారు. అయితే దాదాపు 35 ఏళ్లుగా ఉంటున్న ఈ మార్కెట్ అహ్మదాబాద్‌లో అతిపెద్ద డ్రైఫ్రూట్ మార్కెట్‌గా పరిగణించబడుతుంది. ఈ మార్కెట్‌లో వాల్ నట్స్, జీడిపప్పు, బాదం, అంజీర, పిస్తా వంటి వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ సరసమైన ధరలకు లభిస్తున్నాయి. పండుగల సమయంలో బహుమతులు ఇవ్వడానికి డ్రైఫ్రూట్స్‌కు అందమైన గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఉంటాయి.

ఈ మార్కెట్‌.. ఇతర మార్కెట్‌ల కంటే తక్కువ ధరకే అది కూడా హోల్‌సేల్ రేట్లకే డ్రైఫ్రూట్ను అందిస్తుంది. కేవలం రూ. 500 నుంచి రేట్లు స్టార్ట్ అవుతుంది. దాదాపు 15 నుంచి 20 దుకాణాలు ఉన్నాయి. అందులో కొన్ని షాప్స్ అయితే తరతరాలుగా నడుస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా జీడిపప్పు, బాదం బాగా ప్రాచుర్యం పొంది.. ఎక్కువగా అమ్ముడవుతాయి. రేట్లు తక్కువ ఉండడంతో ఎక్కడెక్కడినుంచో వచ్చి ప్రజలు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో డ్రై ఫ్రూట్స్‌ను కొనుగోలు చేస్తుంటారు.

Advertisement

Next Story

Most Viewed