రన్నింగ్ ట్రైన్ పై స్టంట్ చేద్దామనుకున్నాడు.. చివరికి బూడిదయ్యాడు.. వైరల్ వీడియో

by Sumithra |
రన్నింగ్ ట్రైన్ పై స్టంట్ చేద్దామనుకున్నాడు.. చివరికి బూడిదయ్యాడు.. వైరల్ వీడియో
X

దిశ, ఫీచర్స్ : ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నచందంగా ప్రవర్తిస్తున్నారు నేటి కాలం యువత. ముఖ్యంగా రీల్స్, వీడియోలు, భయంకరమైన స్టంట్లు చేస్తూ వారి పిచ్చిని ప్రదర్శిస్తున్నారు. అయితే కొంతమంది చేసే కొన్ని వీడియోలు ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నన్పటికీ కొంతమంది చేసే స్టంట్లు మాత్రం వారి ప్రాణాలను సైతం బలితీసుకుంటున్నాయి. వారు చేసిన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తే చాలనుకుంటూ ఎత్తైన భవనాల మీద నుంచి దూకడం, నడుస్తున్న వాహనాల మధ్యలో రోడ్డు పై విన్యాసాలు చేయడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలోనే ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తన ప్రయాణం తాను చేసుకోకుండా కదులుతున్న రైలు పైకి ఎక్కి విన్యాసాలు చేయడం ప్రారంభించాడు. కానీ అతను యమరాజు దగ్గరికి చేరుకునేందుకు కొన్ని నిమిషాలే ఉందని గ్రహించలేకపోయాడు. ఈ వీడియోలో ఓ వ్యక్తి కదిలే రైలు కిటికీలోంచి బయటికి వచ్చి స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అలా చేస్తూ కొద్దిసేపటికి అతను రైలు పైకి ఎక్కాడు. కొన్ని క్షణాల పాటు రైలు పై ఎంజాయ్ చేసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కదిలే రైలుపైనే అలా నిర్జీవంగా పడిఉన్నాడు. ఆ వీడియో చూస్తే అతను చనిపోయాడని స్పష్టమవుతుంది. Xలో భాగస్వామ్యమయిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

Next Story