Shanghai : ఆకాశంలో అద్భుతం..షాంఘైలో న్యూ ఇయర్ వేడుకలు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-01 09:28:03.0  )
Shanghai : ఆకాశంలో అద్భుతం..షాంఘైలో న్యూ ఇయర్ వేడుకలు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ఆనందోత్సహాల మధ్య సంబరంగా జరుపుకున్నారు. విదేశాల్లో ఆంగ్ల సంవత్సరం ప్రారంభ వేడుకలు ఆకాశమే హద్దుగా సాగుతుంటాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా చైనాలోని షాంఘై పట్టణంలో నిర్వహించిన కళ్లుచెదిరే డ్రోన్ షో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనా జానపద, పురాణ హీరోలు, జంతువుల ఆకారంతో డ్రోన్ షో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. లక్షల మంది ప్రజలు నది ఒడ్డున నిలబడి డ్రోన్ షోను అబ్బురంగా తిలకిస్తూ సెల్ ఫోన్లలో బంధిస్తూ కేరింతలు కొట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా చైనా నిర్వహించిన ఈ డ్రోన్ షో ఆ దేశం సాంకేతిక విజ్ఞాన ప్రగతిని చాటింది. డ్రోన్ షోలో డ్రాగన్ షో ప్రత్యేకాకర్షణగా నిలిచింది.

ఆకాశంలో వృత్తాకారంలో కొన్ని డ్రోన్లు పరిభ్రమిస్తుండగా మరికొన్ని డ్రోన్ లు రంగురంగులుగా డ్రాగన్ ఆకారంలో వంకరలు తిరుగుతూ వలయ వృత్తంలోకి వెలుతున్న దృశ్యం గ్రాఫిక్ సినిమాను తలపించింది. ఆ దృశ్యం చూస్తుంటే ద్రౌపది స్వయంవరంలో మత్స్య యంత్రం ఏర్పాట్ల చుట్టు పలు సినిమాల్లో, టీవీ షోల్లో తీసిన గ్రాఫిక్ దృశ్యాలు గుర్తుకు రాకమానదు.

మరోవైపు అరబ్ దేశం అబుధాబీ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎక్కువసేపు బాణసంచ కాల్చడంలో వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. 53 నిమిషాల పాటు బాణసంచాలు పేల్చింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

Advertisement

Next Story

Most Viewed